LIC IPO: భారత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మరోసారి సెబీకి వెళ్లింది. ఐపీఓ కోసం మరోసారి దరఖాస్తు చేసుకుంది. తాజా వివరాలతో కూడిన ప్రాథమిక పత్రాలను సెబీకి సమర్పించింది. డిసెంబర్ త్రైమాసికం ఫలితాలను జత చేసి పబ్లిక్ ఇష్యూకి అనుమతి కోరింది. గతనెల 13న ఎల్‌ఐసీ తొలిసారి సెబీకి ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకుంది. అప్పుడు సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలతో కూడిన పత్రాలను అందించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీనికి ఇటీవల సెబీ ఆమోదం తెలిపింది. దీని ప్రభావం పబ్లిక్ ఇష్యూకి వెళ్లేందుకు ఎల్‌ఐసీకి మే 12 వరకు గడువు ఉంది. ఐతే తాజా పరిణామాలతో పబ్లిక్ ఇష్యూ ప్రారంభించేందుకు కావాల్సిన గడువు మరింత పెరగనుంది. దీంతో మార్కెట్లలో స్థిరత్వం వచ్చే వరకు వేచి చూసేందుకు ప్రభుత్వానికి సమయం లభిస్తుంది. 


అక్టోబర్-డిసెంబర్‌ త్రైమాసికంలో ఎల్‌ఐసీకి 235 కోట్ల నికర లాభం చేకూరింది. ఏప్రిల్-డిసెంబర్ మధ్య మొత్తంగా 16 వందల 71 కోట్ల లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే సమయంలో ఈ లాభాలు 7.08 కోట్లుగా నమోదు అయ్యాయి. ఎల్‌ఐసీలో 5 శాతం ఈక్విటీ షేర్లను ప్రభుత్వం విక్రయించనుంది. 


63 వేల కోట్ల వరకు ఖజానాకు చేరతాయని విశ్లేషకులు చెబుతున్నారు. సంస్థలో వంద శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం 5 శాతం వాటాను విక్రయించబోతోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలతో ఆ ప్రక్రియ ఆలస్యమవుతోంది. 


Also Read: IPL 2022: వైరల్ పిక్.. చిరంజీవి హీరోయిన్‌ను చంకనెత్తుకున్న క్రికెట్ కామెంటర్!!


Also Read: LPG Cylinder Price: వంటగ్యాస్‌పై భారీ వడ్డింపు.. ఆల్ టైమ్ హై! తెలంగాణ‌లో గ్యాస్‌ సిలిండర్‌ ధర ఎంతో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook