LIC Policy 2023: ఎల్ఐసీ పాలసీదారులకు షాక్.. కేంద్రం కీలక నిర్ణయం
LIC Policy Update: ఆర్థిక సంవత్సరం చివరికి వచ్చేసరికి చాలామంది ట్యాక్స్ పేయర్స్.. వెంటనే లెక్కలు చూపించేందుకు బీమా పాలసీలు తీసుంటారు. దీంతో బీమా సంస్థలు భారీగా లాభపడుతుండగా.. ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా..
LIC Policy Update: దేశంలోని అతిపెద్ద జీవిత బీమా కంపెనీ ఎల్‌ఐసీ నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. ఇంతకుముందు ఎల్‌ఐసీపై కేంద్ర ప్రభుత్వం భారీ పన్ను ప్రయోజనాన్ని కల్పించేది. అయితే ఈసారి నిబంధనలలో పెద్ద మార్పు చేసింది. ఇక నుంచి ప్రజలు ఎల్‌ఐసీ పాలసీ తీసుకున్నా.. అది ట్యాక్స్ బెనిఫిట్ కిందకు రాదు. గతంలో ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం.. ఎల్ఐసీ పాలసీ కొనుగోలు చేస్తే.. పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. దీంతో ఎక్కువమంది వినియోగదారులు ఎక్కువగా ట్యాక్స్ సేవింగ్స్ కోసం మాత్రమే ఎల్ఐసీ పాలసీని తీసుకుంటున్నారు.
కంపెనీ మొత్తం వార్షిక ప్రీమియంలో సగం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వస్తుందని ఎల్‌ఐసీ ఛైర్మన్ తెలిపారు. ప్రస్తుతం ఒక శాతం కంటే తక్కువ ప్రీమియం రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉన్న పాలసీలు ఉన్నందున.. తక్కువ ప్రభావాన్ని చూపుతుందన్నారు. మరోవైపు ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఎల్‌ఐసీ పాలసీలను కలిగి ఉంటే.. వారి మొత్తం ప్రీమియం కలిపి 5 లక్షల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు వారికి ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుందన్నారు.
ఆర్థిక సంవత్సరం చివరిలో ఎక్కువ మంది ప్రజలు బీమా పాలసీలను కొనుగోలు చేయడానికి చాలా ఆసక్తిని కనబరుస్తారు. ఈ టైమ్‌లో తన ట్యాక్స్ సేవ్ చేసుకునేందుకు మరో ఆలోచన లేకుండా బీమా పాలసీలలో డబ్బును పెట్టుబడి పెడతారు. రూ.5 లక్షల కంటే ఎక్కువ ప్రీమియంతో పాలసీ మెచ్యూరిటీపై ఇక నుంచి పన్ను చెల్లించాలని బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో పాటు పన్నుపై మినహాయింపు లేని కొత్త పన్ను విధానాన్ని ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తోంది. అంటే ఇక నుంచి ట్యాక్స్ బెనిఫిట్ కోసం ఎల్‌ఐసీ పాలసీని తీసుకునే వారు తగ్గిపోనున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎల్‌ఐసీ వృద్ధిపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా రాబోయే కాలంలో బీమా కంపెనీలపై కూడా ఎఫెక్ట్ పడుతుందని అంటున్నారు.
Also Read: Pawan Kalyan: ఆడ బిడ్డలకు రక్షణ ఉందా..? అంధ యువతి హత్య ఘటనపై పవన్ ఆవేదన
Also Read: Google Office Bomb Threat: గూగుల్ ఆఫీస్‌కు బాంబ్ బెదిరింపు కాల్.. పరుగులు పెట్టిన పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి