LIC Claim Process: జీవిత భీమా పాలసీ రంగంలో దేశంలోనే అతిపెద్దది ఎల్ఐసీ. ఇటీవల ఐపీవో విడుదలతో మరింత ప్రాచుర్యం పొందింది. పాలసీదారుడు మరణిస్తే..ఆ పాలసీని ఎలా క్లెయిమ్ చేయాలి. ఈ విషయంపై ఎల్ఐసీ ఏం చెబుతోంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో ప్రతి పదిమందిలో ఇద్దరికైనా ఎల్ఐసీ పాలసీ ఉంటుందనేది ఓ అంచనా. ముఖ్యంగా మథ్య తరగతి కుటుంబాల్లో కచ్చితంగా ఎల్ఐసీ పాలసీ ఉంటుంది. ప్రతి పల్లెపల్లెకు విస్తరించిన సంస్థ ఇది.  కొంతమంది పాలసీలను కొనసాగిస్తుుంటారు. ఇంకొంతమంది మధ్యలో ఆపేస్తుంటారు. ఇంకొన్ని పాలసీలు పాలసీదారుడి అకాల మరణంతో నిలిచిపోతుంటాయి. ఈ నేపధ్యంలో పాలసీదారుడు మరణిస్తే.. సంబంధిత నామినీ ఆ పాలసీను ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే విషయంలో ఎల్ఐసీ కొన్ని సూచనలు ఇస్తోంది. అవేంటో చూద్దాం.


పాలసీ తీసుకున్న వ్యక్తి ఒకవేళ చనిపోతే..నామినీ లేదా కుటుంబసభ్యులు సంబంధిత పాలసీను క్లెయిమ్ చేసుకోవల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు  తెలుసుకుందాం. డెత్ క్లెయిమ్ ఫైల్ చేసే ప్రక్రియను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం మంచిది. డెత్ క్లెయిమ్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్‌లో ఉంటుంది. పాలసీ తీసుకున్న హోమ్ బ్రాంచ్‌ను సంప్రదించాలి. ఆ శాఖకు వెళ్లేముందు అవసరమైన అన్ని పత్రాల్ని తీసుకెళ్లాలి. డెత్ క్లెయిమ్ ఫారమ్‌ను సమర్పించే ముందు పాలసీ చేసిన ఏజెంట్ లేదా డెవలప్‌మెంట్ ఆఫీసర్ సంతకం తప్పనిసరి. 


ఎలా క్లెయిమ్ చేయాలి


డెత్ క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ముందుగా ఎల్ఐసీ హోమ్ బ్రాంచ్‌ను సంప్రదించాలి. పాలసీదారుడి మరణం గురించి చెప్పాలి. నామినీ బ్యాంకు ఖాతాలో నిధుల బదిలీ నిమిత్తం ఫారం 3783, ఫారం 3801, ఎన్ఈఎఫ్‌టీ ఫారమ్‌లు తీసుకోవాలి. ఈ ఫారమ్‌లను ఫిల్ చేసి..ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్, ఒరిజినల్ పాలసీ బాండ్, నామినీ పాన్‌కార్డు, నామినీ ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్, మరణించిన పాలసీదారుడి ఐడీ, నామినీ డిక్లరేషన్ ఫారమ్ సమర్పించాలి. 


క్లెయిమ్‌కు కావల్సిన వివరాలు


పాలసీదారుడు మరణించిన తేదీ, మరణించిన ప్రదేశం, మరణానికి కారణం గురించి చెప్పాల్సి ఉంటుంది. ఎన్ఈఎఫ్‌టీ ఫారంతో పాటు నామినీ బ్యాంకు ఖాతాదారుని పేరు, ఎక్కౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ ఉన్న క్యాన్సెల్ చెక్ సమర్పించాలి. బ్యాంకు పాస్‌బుక్ ఫోటో కాపీ కూడా తప్పకుండా సబ్మిట్ చేయాలి. నామినీకు సంబంధించిన పాన్‌కార్డు, పాలసీదారుడి ఐడీ ప్రూఫ్, వెరిఫికేషన్ నిమిత్తం ఒరిజినల్ బ్యాంక్ పాస్‌బుక్ వంటివి తప్పకుండా తీసుకెళ్లాలి. 


డెత్ క్లెయిమ్ ప్రోసెసింగ్ డాక్యుమెంట్లు ఆమోదించడానికి ముందు ఎల్ఐసీ ఆఫీసర్ ఒరిజినల్ పాస్‌బుక్ కాపీతో వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. మొత్తం నగదును నామినీ బ్యాంకు ఎక్కౌంట్‌లో బదిలీ చేసే ముందు ఎల్ఐసీ కొన్ని అదనపు డాక్యుమెంట్లను కోరే అవకాశముంది. డాక్యుమెంట్లు సమర్పించిన తరువాత ఎక్‌నాలెడ్ద్‌మెంట్ రసీదు భద్రపర్చుకోవాలి. నెల వ్యవధిలో నగదు మొత్తం బదిలీ అవుతుంది. 


Also read: Post Office Saving Schemes: ఈ పోస్టాఫీసు పథకాల్లో డబ్బులు పెడితే..అద్బుత లాభాలు, రెట్టింపు డబ్బు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook