LIC Pension Scheme: ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం పెన్షన్ అందుకోవచ్చు
LIC Pension Scheme: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎల్ఐసీలో అద్భుతమైన ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు జీవితాంతం నెల నెలా పెన్షన్ అందుకోవచ్చు. ఈ పెన్షన్ గ్యారంటీ స్కీమ్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
LIC Pension Scheme: సేవింగ్ ప్లాన్స్‌లో ఎల్ఐసీ మంచి ప్రత్యామ్నాయం. ఇందులో మీ డబ్బులకు సెక్యూరిటీతో పాటు మంచి రిటర్న్స్ లభిస్తాయి. కొంతమంది రిటైర్మెంట్ ప్లాన్స్ కింద ఇందులో సేవింగ్స్ చేస్తుంటారు. ఇంకొంతమంది పెన్షన్ స్కీమ్ కోసం ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలాంటిదే ఈ ప్లాన్.
కష్టపడి సంపాదించిన డబ్బులపై రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ ఉండాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కొంతమంది రిటైర్మెంట్ తరువాత ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు అందుకునేందుకు సేవింగ్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీలో ప్రతి ఆదాయవర్గానికి , ప్రతి వ్యక్తికీ పాలసీలున్నాయి. ఇందులో ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ ఒకటి. ఈ ప్లాన్‌లో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెలా పెన్షన్ల గ్యారంటీ ఉంటుంది. ఈ ప్లాన్‌లో ప్రత్యేకత ఏంటంటే కేవలం ఒకసారే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. జీవితమంతా నెలనెలా పెన్షన్ అందుకోవచ్చు. అందుకే రిటైర్మెంట్ ప్లాన్స్‌లో ఇది చాలా ప్రాచుర్యమైంది. ఎవరైనా ఇటీవల రిటైర్ అయితే పీఎఫ్ ఫండ్, గ్రాట్యుటీ రూపంలో వచ్చే డబ్బును ఇందులో పెట్టుబడి పెడితే ప్రతి నెలా పెన్షన్ తీసుకోవచ్చు.
ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ కనీసం 12 వేల రూపాయలు ఏడాదికి తీసుకోవచ్చు. ఇందులో గరిష్ట పరిమితి ఏదీ లేదు. ఎంత కావలిస్తే అంత పెట్టుబడి పెట్టవచ్చు. మీ పెట్టుబడికి తగ్గట్టుగా పెన్షన్ లభిస్తుంది. ఒకసారి ప్రీమియం చెల్లించాక ఏడాదికి లేదా ఆరు నెలలకు లేదా ప్రతి నెలా పెన్షన్ తీసుకోవచ్చు. 42 ఏళ్ల వ్యక్తి 30 లక్షల యూన్యుటీ తీసుకుంటే ప్రతినెలా ఆ వ్యక్తికి 12,388 రూపాయలు లభిస్తాయి.
ఎల్ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్‌ను 40 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వరకూ ఎవరైనా తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌ను ఒంటరిగా లేదా భార్యాభర్తలిద్దరూ కలిసి తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న ఆరు నెలల తరువాత ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో డెత్ బెనిఫిట్ కూడా ఉంది. పాలసీదారుడు మరణిస్తే నామినీకు మొత్తం డబ్బు తిరిగిచ్చేస్తారు.
జీవితాంతం పెన్షన్ గ్యారంటీ ఇచ్చే ఈ ప్లాన్‌లో పాలసీదారుడు లోన్ కూడా పొందవచ్చు. పాలసీ ఓపెన్ చేసిన ఆరు నెలల తరువాత ఎప్పుడైనా లోన్ తీసుకోవచ్చు. ఇందులో ఎంత పెట్టుబడి పెడితే పెన్షన్ అంత ఎక్కువగా ఉంటుంది.
Also read: 8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, భారీగా పెరగనున్న కనీస వేతనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook