8th Pay Commission: కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన అప్‌డేట్ జారీ కానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న 7వ వేతన సంఘం స్థానంలో 8వ వేతన సంఘం ఏర్పాటు కావల్సి ఉంది. కానీ కొత్త వేతన సంఘం ఏర్పాటు కాకుండానే ఉద్యోగులకు వరం అందనుంది. అంటే 8వ వేతన సంఘంతో సంబంధం లేకుండానే ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీస వేతనం పెరగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం శుభవార్త అందించనుంది. త్వరలో కనీస వేతనం 18 వేల నుంచి 21 వేలకు పెంచవచ్చు. ఇప్పటివరకూ 7వ వేతన సంఘం సిఫార్సుల ఆధారంగా కనీస వేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 వేలుగా ఉంది. ఇది లెవెల్ 1 ఉద్యోగులకు మాత్రమే. వేర్వేరు కేటగరీలకు కనీస వేతనం వేర్వేరుగా ఉంటుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులంతా 8వ వేతన సంఘం ఏర్పాటుకై ఎదురుచూస్తున్నారు. కానీ ఈసారి దానికి బదులు కనీస వేతనం పెంచే ఆలోచన చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. 2016 చివర్లో వేతన సంఘం సిపారసుల్ని అమలు చేసిన తరువాత అప్పటి ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనాన్ని 18 వేల నుంచి పెంచేందుకు నిర్ణయించింది. అప్పట్నించి ఇది పెండింగులోనే ఉంది. బడ్జెట్ తరువాతే దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.
3 వేలు పెరగనున్న కనీస వేతనం
7వ వేతన సంఘం సిఫారసుల్లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్లుగా ఉంది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెరిగింది. 7వ వేతన సంఘంలో జీతం పెంపు చాలా తక్కువగా నమోదైంది. కనీస వేతనం 18 వేలు చేశారు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను మార్చి 3.68 రెట్లకు పెంచవచ్చు. అదే జరిగితే కనీస వేతనం 18 వేల నుంచి 27 వేలు అవుతుంది. కానీ కనీస వేతనాన్ని 18 వేల నుంచి 21 వేలు చేయవచ్చని సమాచారం అందుతోంది.
ధరల పెరుగుదల ప్రభావంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గిపోయింది. కనీస వేతనం పెరిగితే ఆర్ధిక పరిస్థితిలో మార్పు రావచ్చు. జీతాలు పెరిగితే ఉద్యోగుల జీవితం మెరుగుపడుతుంది. అవసరాలు పూర్తి చేసుకునేందుకు వీలవుతుంది. ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. జీతంలో ఎప్పుడైతే పెరుగుదల ఉంటుందో ప్రొడక్టివిటీ కచ్చితంగా పెరుగుతుంది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం పెంపుపై ప్రకటన చేయవచ్చు. త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2024 తరువాత ఈ ప్రకటన జారీ కావచ్చు.
Also read: Budget 2024 25: కేంద్ర బడ్జెట్‌లో ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.లక్షల్లో అద్భుత ప్రయోజనాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook