LIC Best Scheme For Pension: ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే జీవితాంతం పెన్షన్ అందుకునే అద్భుతమైన పాలసీ ఇది. LIC అందిస్తున్న సరళ్ పెన్షన్ స్కీమ్. కేవలం ఒకే ఒకసారి ఇన్వెస్ట్ చేసే పధకం కావడంతో అందరూ ఆకర్షితులవుతున్నారు. 40 నుంచి 80 ఏళ్ల వయస్సులో ఎవరైనా ఈ స్కీములో చేరవచ్చు. ఉద్యోగస్థులకు ఈ పథకం చాలా అనువైందిగా చెప్పవచ్చు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉద్యోగస్థులకు రిటైర్మెంట్ తరువాత ఏం చేయాలనే విషయంపై ఎప్పుడూ సందిగ్దత ఉంటుంది. టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఓ వయస్సు వచ్చాక పని చేయలేం. లేదా సంస్థ ఉంచుకోదు. ఈ సమయంలో డబ్బులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు రెగ్యులర్ పెన్షన్ అనేది అవసరం. ఎల్ఐసీ పెన్షన్ ప్లాన్ మంచి ప్రత్యామ్నాయం. ఎల్ఐసీ కస్టమర్లకు చాలా పెన్షన్ పథకాల్ని అమలు చేస్తోంది. అందులో అత్యుత్తమమైంది ఎల్ఐసీ సరళ్ పెన్షన్ పథకం. ఇదొక సింగిల్ ప్రీమియం, నాన్ లింక్డ్, ఇండివిడ్యువల్ ప్లాన్. ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా క్రమం తప్పకుండా పెన్షన్ పొందవచ్చు.


ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఒకేసారి ఉంటుంది. ఈ ప్లాన్‌ను సింగిల్‌గా లేదా జీవిత భాగస్వామితో కలిసి తీసుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు కనీస వయస్సు 40 ఏళ్లు కాగా గరిష్టంగా 80 ఏళ్లలోపుండాలి. దీనికోసం ఈ ప్లాన్ తీసుకునేటప్పుడు ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి నెలా క్రమం తప్పకుండా ఒకే పెన్షన్ మొత్తం తీసుకోవచ్చు. ఆరు నెలల తరువాత ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు.


ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్‌లో పెన్షన్‌ను నెలకోసారి, త్రైమాసికంగా, ఆరు నెలలకోసారి, ఏడాదికోసారి మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు. నెలకు కనీస పెన్షన్ నగదు 1000 రూపాయలు కాగా మూడు నెలలకు 3 వేలుంటుంది. ఏడాదికి 12 వేలు. గరిష్టంగా ఎంతైనా ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. ఒకవేళ ఈ ప్లాన్‌లో 30 లక్షలు పెట్టుబడి పెడితే ప్రతి నెలా పెన్షన్ కింద 12, 388 రూపాయలు అందుకోవచ్చు. మీ డిపాజిట్ నగదు పెరిగేకొద్దీ పెన్షన్ పెరుగుతుంది. ఎల్ఐసీ సరళ్ పెన్షన్ స్కీమ్‌లో రుణం కూడా తీసుకోవచ్చు. స్కీమ్ ప్రారంభించిన ఆరు నెలలకు రుణం తీసుకునేందుకు అర్హులౌతారు. ఆరు నెలల తరువాత అవసరం లేదనుకుంటే విత్ డ్రా కూడా చేసుకోవచ్చు. 


Also Read: RFCL Jobs Recruitment 2024: రామగుండంలో కీలక పోస్టుల భర్తీ, ఎలా అప్లై చేయాలంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook