Stock Market Live Updates: స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 4 గంటల్లో 10 లక్షల కోట్లు హుష్ కాకి..
Stock Market Crash Live News: స్టాక్ మార్కెట్లలో నేడు బ్లడ్ బాత్ కొనసాగుతోంది. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతో ఒక్కసారిగా నేడు ఆసియా మార్కెట్లలో పతనం ప్రారంభమైంది. దీనికి తోడు జపాన్ మార్కెట్ నిక్కి ఈరోజు ఏకంగా ఏడు శాతం పతనమైంది. దీని ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్ లు కూడా భారీగా పతనం అవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 2500 పాయింట్లు పతనమైంది..
Stock Market Live News: దేశీయ స్టాక్ మార్కెట్ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో గందరగోళం నెలకొని ఉంది. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 2 నుంచి 3 శాతం నష్టాన్ని చూస్తున్నాయి. సెన్సెక్స్ 2300 పాయింట్ల దిగువన ట్రేడవుతుండగా, నిఫ్టీ 24,000 దిగువకు పడిపోయింది. మొదటి 3 గంటల్లోనే మార్కెట్లు బడ్జెట్ రోజు కనిష్ట స్థాయిని దాటాయి. ఇదొక్కటే కాదు, ఆసియా మార్కెట్లలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. జపాన్‌లో, నిక్కీ 4200 పాయింట్లు పడిపోయింది. అక్కడ, ఫ్యూచర్స్‌లో ట్రేడింగ్ నిలిపివేశారు. అమెరికాలో మాంద్యం భయాల నేపథ్యంలో గత వారం మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. దీని ప్రభావం ఈ రోజు సోమవారం ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లలో కనిపిస్తుంది. అమెరికాలో నిరుద్యోగం రేటు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఉద్యోగాల డేటా కూడా ఊహించిన దాని కంటే బలహీనంగా ఉంది. దీని కారణంగా మాంద్యం భయం తీవ్రమైంది. పైగా, ఇజ్రాయెల్, హమాస్, ఇరాన్ మధ్య ఉద్రిక్తత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే యెన్ బలపడటం వల్ల జపాన్‌లో యెన్ క్యారీ ట్రేడ్ ముగుస్తుందన్న భయం నెలకొని ఉంది. దీంతో ఆసియా మార్కెట్లలో భారీగా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్లో లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి.
Latest Updates
Stock Market Crash Live Updates : ఇండెక్స్ హెవీ వెయిట్ స్టాక్స్ లో భారీ నష్టాలు : ఇండెక్స్ సూచీలో మార్కెట్ క్యాప్ పరంగా హెవీ వెయిట్ స్టాక్స్ గా పేరు పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.47 శాతం నష్టపోగా, మరి కొన్ని హెవీ వెయిట్ స్టాక్స్ అయిన HDFC Bank 2.62 శాతం, టీసీఎస్ 2.99 శాతం, SBI 4.27 శాతం, ఇన్ఫోసిస్ 3.81 శాతం చొప్పున నష్టపోయాయి.
Stock Market Crash Live Updates : ఆటో మొబైల్ స్టాక్స్ లో కూడా భారీ అమ్మకాలు: టాటా మోటార్స్ అత్యధికంగా నేటి ట్రేడింగులో 7.31 శాతం నష్టపోయింది. ఇదే తరహాలో మహీంద్ర అండ్ మహీంద్ర 2.57 శాతం, హీరో మోటో కార్మ్ 1.71 శాతం, మారుతి సుజుకి 4.13 శాతం, ఐషర్ మోటార్స్ 1.08 శాతం చొప్పున నష్టపోయాయి.
Stock Market Crash Live Updates : దాదాపు అన్ని సెక్టార్లలో అమ్మకాల ఒత్తిడి: నిఫ్టీ ఐటీ సూచీ 3.26 శాతం, నిఫ్టీ బ్యాంక్ 2.45 శాతం, నిఫ్టీ రియాలిటీ 4.32 శాతం, నిఫ్టీ ఎనర్జీ 3.82 శాతం, నిఫ్టీ ఫార్మా 1.46 శాతం చొప్పున కీలక సెక్టార్లలో నష్టాలు చవి చూశాయి.
Stock Market Crash Live Updates : టాప్ గెయినర్లలో హిందుస్తాన్ యూనిలీవర్ 0.87 శాతం, నెస్లే ఇండియా 0.63 శాతం, HDFC లైఫ్ ఇన్సూరెన్స్ 0.49, టాటా కన్స్యూమర్ ప్రోడక్ట్ 0.48 శాతం చొప్పున లాభపడ్డాయి.
Stock Market Crash Live Updates : టాప్ లూజర్లలో టాటా మోటార్స్ 7.40 శాతం నష్టపోయింది. ఓఎన్‌జీసీ 6.18 శాతం నష్టపోయింది. అదే సమయంలో అదానీ పోర్ట్ షేరు 5.86 శాతం నష్టపోగా, టాటా స్టీల్ 5.61 శాతం నష్టపోయింది.
Stock Market Crash Live Updates : భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ..నేటి ట్రేడింగులో సెన్సెక్స్ 2,222 పాయింట్లు నష్టపోయింది 78759 పాయింట్ల వద్ద స్థిరపడింది. అదే సమయంలో నిఫ్టీ సూచీ 662 పాయింట్లు నష్టపోయి 2,055 వద్ద ముగిసింది.
Stock Market Crash Live Updates : ఫార్మా స్టాక్స్ లో కూడా నేడు భారీ పతనం నమోదు అవుతోంది. నిఫ్టీ ఫార్మా సూచీ 1.46 శాతం పతనం అయ్యింది. నిఫ్టీ సూచీలోని ప్రధాన షేర్లు అయిన సిప్లా 1 శాతం నష్టపోగా, దివీస్ ల్యాబ్స్ 3.19 శాతం, డాక్టర్ రెడ్డీస్ 2.16 శాతం, సన్ ఫార్మా 0.70 శాతం చొప్పున నష్టపోయాయి.
Stock Market Crash Live Updates : నిఫ్టీ బ్యాంకు సూచి 2.29 శాతం నష్టపోయింది ఇందులో ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4.17% నష్టపోయింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ 1.63%, HDFC బ్యాంక్ 2.42 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.42 శాతం నష్టపోగా, ఐసిఐసిఐ బ్యాంక్ 1.60 శాతం నష్టపోయాయి.
Stock Market Crash Live Updates : నిఫ్టీ ఐటీ సూచి మైనస్ 3.81 శాతం చొప్పున నష్టపోయింది నిఫ్టీ ఇండెక్స్ లో ఉన్న ప్రధాన ఐటీ కంపెనీలు హెచ్సీఎల్ టెక్నాలజీస్ 3.17% నష్టపోయింది ఇన్ఫోసిస్ కంపెనీ 4.26% నష్టపోయింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ 3.34% నష్టపోయింది టెక్ మహీంద్రా 3.97% నష్టపోయింది విప్రో 3.53% నష్టపోయింది
Stock Market Crash Live Updates : నిఫ్టీ మెటల్ సూచి 4.22 శాతం పతనమైంది 50 లో ప్రధానంగా ఉన్న మెటల్ కంపెనీలు హిండాల్కో ఇండస్ట్రీస్ (- 4.69 శాతం) జె ఎస్ డబ్ల్యూ స్టీల్ (-3.40 శాతం), టాటా స్టీల్ (-4.66 శాతం) వేదాంత (-4.35 శాతం), అదాని ఎంటర్ప్రైజెస్ (-3.14) చొప్పున భారీగా నష్టపోయాయి
Stock Market Crash Live Updates : పెరుగుతున్న వడ్డీ రేట్లతోపాటు నిరుద్యోగం బ్రిటన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. దేశం మాంద్యలోకి వెళ్తోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. భారీగా పెరుగుతున్న వడ్డీ రేట్లకు నిరుద్యోగం కూడా తోడవ్వగా.. బ్రిటన్ ఇప్పటికే మాంద్యంలో చిక్కుకున్నట్లు బ్లూబర్గ్ గతంలోనే నివేదించింది. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో బ్రిటన్ GDP 0.1 % పడిపోయింది. దేశంలో ప్రస్తుతం అన్ ఎంప్లాయిమెంట్ 4.7శాతం ఉండగా..2026 నాటిని ఇది 5.1 శాతానికి పెరగడం ఖాయమని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది.
Stock Market Crash Live Updates: పెరుగుతున్న వడ్డీ రేట్లతోపాటు నిరుద్యోగం బ్రిటన్ ను అతలాకుతలం చేస్తున్నాయి. దేశం మాంద్యలోకి వెళ్తోందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. భారీగా పెరుగుతున్న వడ్డీ రేట్లకు నిరుద్యోగం కూడా తోడవ్వగా.. బ్రిటన్ ఇప్పటికే మాంద్యంలో చిక్కుకున్నట్లు బ్లూబర్గ్ గతంలోనే నివేదించింది. 2023 సెప్టెంబర్ త్రైమాసికంలో బ్రిటన్ GDP 0.1 % పడిపోయింది. దేశంలో ప్రస్తుతం అన్ ఎంప్లాయిమెంట్ 4.7శాతం ఉండగా..2026 నాటిని ఇది 5.1 శాతానికి పెరగడం ఖాయమని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ అంచనా వేసింది.
Stock Market Crash Live Updates: గోద్రేజ్ ప్రాపర్టీ షేర్ ధర నేడు 2803 రూపాయల వద్ద ట్రేడవుతోంది. ఈ షేరు ధర ఇంట్రాడేలో సుమారు 7 శాతం వరకూ పతనం అయ్యింది. భూముల కొనుగోళ్లు, నిర్మాణ కార్యకలాపాలపై అధిక ఖర్చుల కారణంగా గోద్రెజ్ ప్రాపర్టీస్ నికర రుణం జూన్ త్రైమాసికంలో 20 శాతం పెరిగి రూ.7,432 కోట్లకు చేరుకుందని ప్రకటించింది.
Stock Market Crash Live Updates: ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇంటెల్ 15 వేల మంది ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది మొత్తం వారి ఉద్యోగ సామర్ధ్యంలో 15% కావడం గమనార్హం. ఈ కోత వల్ల తమకు 2025 సంవత్సరంలో పది బిలియన్ డాలర్ల ఖర్చు తగ్గుతుందని కంపెనీ ప్రకటించింది
గ్లోబల్ మార్కెట్లలో ఆందోళన, దక్షిణ కొరియా, తైవాన్ మార్కెట్లు కూడా పడిపోయాయి.
Stock Market Crash Live Updates: గ్లోబల్ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి మధ్య సోమవారం దలాల్ స్ట్రీట్ బ్లడ్ బాత్ చవి చూసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్ 2,686 పాయింట్లు పతనమై 78,295 పాయింట్ల కనిష్ట స్థాయికి దిగజారగా, నిఫ్టీ 823 పాయింట్లు పతనమైంది.
Stock Market Crash Live Updates:జపాన్ స్టాక్ ఇండెక్స్ నిక్కీ 225 సోమవారం 8.1 శాతం పడిపోయింది. సోమవారం మధ్యాహ్నం నాటికి నిక్కీ సూచీ 2,900 పాయింట్లకు పైగా పడిపోయి 32,991 పాయింట్ల వద్దకు చేరుకుంది. అక్టోబరు 1987 తర్వాత నిక్కీ సూచీలో ఇదే అత్యధిక పతనం. బ్యాంక్ ఆఫ్ జపాన్ (BOJ) కీలక వడ్డీ రేటును పెంచడంతో టోక్యోలో షేర్ల ధరలు భారీగా పడిపోయాయి.
Stock Market Crash Live Updates: క్యూవన్ ఫలితాల్లో టైటాన్ ఆశించిన మేర ఫలితాలు దక్కకపోవడంతో నేడు సెన్సెక్స్ సూచీలో టైటాన్ షేర్ ధర 7.50 రూపాయలు పతనమైంది. జూన్ క్వార్టర్ లో టైటాన్ నికర లాభంలో ఒక శాతం తగ్గుదల నమోదు అయింది.
Stock Market Crash Live Updates: స్టేట్ బ్యాంక్ షేర్ ధర ఈరోజు బిఎస్‌ఇలో 5.2 శాతం క్షీణించి రూ.804కి చేరుకుంది.
Stock Market Crash Live Updates: సోమవారం US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమైంది. ప్రస్తుతం డాలర్ కు ప్రతిగా రూపాయి విలువ 83.80 వద్ద ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది.