RBI Rules For Loan Recovery: చాలా మంది ఏదో అవసరాలకు బ్యాంక్ నుంచి లోన్లు తీసుకుంటారు. అయితే కొద్ది మంది మాత్రం ఏ అవసరం లేకపోయినా లోన్ తీసుకుని ఖర్చు పెడుతుంటారు. మీరు దేనికోసం రుణం తీసుకున్నా.. బ్యాంక్ మాత్రం ప్రతి నెల ఈఎంఐ మాత్రం సమయానికి చెల్లించాల్సిందే. ఒక్కోసారి ఆర్థిక ఇబ్బందుల కారణంగానో.. మధ్యలో జాబ్‌ పోవడమో.. అనారోగ్యం కారణంగానో తీసుకున్న లోన్ చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. అయినా బ్యాంక్‌లకు మాత్రం ఇవేమి పట్టవు. ఒక ఈఎంఐ చెల్లించకపోతే ఫోన్స్‌ కాల్స్‌ చేసి అడుగుతారు. కాల్స్‌కు స్పందించకుండా రెండో ఈఎంఐ కూడా చెల్లించకపోతే వెంటనే లోన్ రికవరీ ఏజెంట్లను పంపిస్తాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

లోన్ రికవరీ ఏజెంట్లు ఇళ్ల వద్దకు వచ్చిన ఈఎంఐలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తారు. కొన్నిసార్లు బెదిరింపులకు కూడా పాల్పడతారు. ఈ వేధింపులు తాళలేక కొంతమంది ఆత్మహత్య చేసుకునేందుకు సైతం వెనకాడటం లేదు. ఈ నేపథ్యంలోనే లోన్ రికవరీకి సంబంధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) కఠినమైన నిబంధనలను రూపొందించింది. అన్ని బ్యాంకులు ఈ నిబంధనలు అనుసరించాల్సిందే. 


లోన్ రికవరీ ఏజెంట్ ఎవరైనా రుణాన్ని కచ్చితంగా చెల్లించాలని బెదిరిస్తే.. ప్రజలకు కొన్ని చట్టపరమైన హక్కులు కూడా ఉంటాయి. ఒక వ్యక్తి రుణాన్ని తిరిగి చెల్లించలేనప్పుడు.. బ్యాంకు ద్వారా మొదటి నోటీసు వస్తుంది. ఆ తరువాత కస్టమర్లను లోన్ రికవరీ ఏజెంట్ల ద్వారా సంప్రదిస్తారు. అయితే చాలా సార్లు లోన్ రికవరీ ఏజెంట్లు కస్టమర్లతో దురుసుగా ప్రవర్తించి బెదిరిస్తున్నారు. 


లోన్ చెల్లించకపోతే నిబంధనల ప్రకారం ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి. రుణం తిరిగి చెల్లించలేని విషయం సివిల్ కేసులలో వస్తుంది. డిఫాల్టర్‌తో ఇష్టానుసారం వ్యవహరించకూడదు. బ్యాంకు అధికారి లేదా రికవరీ ఏజెంట్ ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల మధ్య మాత్రమే డిఫాల్టర్‌కు కాల్ చేయాలి. డిఫాల్టర్ ఇంటికి వెళ్లవలసి వస్తే.. ఆ సమయంలోనే వెళ్లాలి. బ్యాంకు అధికారులు లేదా రికవరీ ఏజెంట్లు ఈ సమయాన్ని బ్రేక్ చేసి.. ఇతర సమయాల్లో కాల్ చేసినా లేదా ఇంటికి వెళ్లినా.. రుణగ్రహీత పోలీసులకు లేదా ఆర్‌బీఐకి ఫిర్యాదు చేయవచ్చు.


లోన్ రెండు ఈఎంఐలు తిరిగి చెల్లించకపోతే బ్యాంక్ రిమైండర్ పంపుతుంది. 3వ ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంక్ లీగల్ నోటీసు పంపుతుంది. దీంతో పాటుగా బ్యాంకు రుణం తీసుకున్న వ్యక్తిని చెల్లించనందుకు డిఫాల్టర్‌గా కూడా ప్రకటించవచ్చు. నోటీసు తర్వాత రికవరీ ఏజెంట్ ద్వారా రుణం తీసుకున్న వ్యక్తి నుంచి రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.


Also Read: MLC Kavitha ED Enquiry: ఊపిరిపీల్చుకున్న బీఆర్ఎస్ వర్గాలు.. ముగిసిన ఎమ్మెల్సీ కవిత విచారణ  


Also Read:  7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగపూట తీపికబురు.. కాసేపట్లో ప్రకటన..?  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి