Personal Loan Interest Rate: పర్సనల్ లోన్ కోసం చూస్తున్నారా, టాప్ 5 బ్యాంకులు, వడ్డీ రేట్లు ఇవే
Personal Loan Interest Rate: ఇటీవలి కాలంలో వ్యక్తిగత రుణాలకు డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న ఖర్చులకు ఎప్పటికప్పుడు డబ్బులు అవసరమౌతుంటాయి. వ్యక్తిగత రుణాలిచ్చేందుకు చాలా సంస్థలు, బ్యాంకులు ముందుకొస్తుంటాయి.
Personal Loan Interest Rate: వ్యక్తిగత రుణాలు తీసుకునేటప్పుడు ఏ బ్యాంకు వడ్డీ రేటు ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఒక్కో సంస్థ లేదా బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ వసూలు చేస్తుంటుంది. ఈ క్రమంలో వ్యక్తిగత రుణాలు ఇచ్చే టాప్ 5 బ్యాంకులు, వడ్డీ రేట్ల గురించి తెలుసుకుందాం.
అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు వ్యక్తిగత రుణాలే బెస్ట్ ఆప్షన్. ఇదొక అన్‌సెక్యూర్డ్ లోన్. ఈ పరిస్థితుల్లో వడ్డీ రేటు హోమ్ లోన్ లేదా కార్ లోన్ కంటే ఎక్కువే ఉంటుంది. మీ సిబిల్ స్కోర్, క్రెడిట్ హిస్టరీని బట్టి ఒక్కో బ్యాంకు ఒక్కో రకమైన వడ్డీ ఆఫర్ చేస్తుంది. మీరు ఎంచుకున్న కాల పరిమితిని బట్టి కూడా వడ్డీ మారుతుంటుంది. దేశంలో అనుకూలమైన వడ్డీ రేట్లకు వ్యక్తిగత రుణాలిచ్చే బ్యాంకుల వివరాలు తెలుసుకుందాం..
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 3 ఏళ్ల నుంచి 72 నెలల కాల పరిమితితో 40 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలు మంజూరు చేస్తోంది. వడ్డీ రేటు 10.75 శాతం నుంచి 24 శాతం ఉంటుంది. ప్రోసెసింగ్ ఫీజు 4999 రూపాయలుంటుంది.
ఇక మరో బ్యాంకు ఎస్బీఐ. ఈ బ్యాంకు 20 లక్షల వరకూ వ్యక్తిగత రుణాలు ఆఫర్ చేస్తోంది. వడ్డీ రేటు 11.15 శాతముంది.
ఇక ఐసీఐసీఐ బ్యాంకు వ్యక్తిగత రుణాలపై 10.65 శాతం వడ్డీ వసూలు చేస్తోంది. ప్రోసెసింగ్ ఫీజు రూపంలో 2.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంకు వ్యక్తిగత రుణాల్ని 10.99 శాతం వడ్డీపై ఇస్తోంది. 50 వేల నుంచి 40 లక్షల వరకూ రుణాలు మంజూరు చేస్తుంది. ప్రోసెసింగ్ ఫీజు 3 శాతముంటుంది.
ఇక మరో బ్యాంకు దేశంలో రెండవ పెద్ద బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్. 12.75 శాతం నుంచి 17.25 శాతం వడ్డీతో రుణాలిస్తోంది.
Also read: Best Investment plans: మీ అమ్మాయి భవిష్యత్‌కు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook