Best Investment plans: కేంద్ర ప్రభుత్వం అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కొన్ని సేవింగ్స్ పధకాలను ప్రారంభించింది. ఈ పధకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ అనంతరం భారీ రిటర్న్స్ పొందవచ్చు. అద్భుతమైన వడ్డీ రేటు లభిస్తుంది. ఆ ప్లాన్స్ ఏంటో తెలుసుకుందాం.
ఇంట్లో అమ్మాయిల భవిష్యత్ కోసం అందుబాటులో ఉన్న పధకాల్లో ముఖ్యమైనవి సుకన్య సమృద్ధి యోజన, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేటే, జనరల్ ప్రోవిడెంట్ ఫండ్ ఇలా చాలా ఉన్నాయి. ఈ పధకాలను బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో తీసుకోవచ్చు. ఈ పథకాల గురించి వివరాలు మీ కోసం..సుకన్యా సమృద్ధి యోజన పధకం పూర్తిగా బాలికల కోసం ఉద్దేశించింది. ఈ పథకంలో 15 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేస్తుండాలి. మీ అమ్మాయికి 21 ఏళ్లు వచ్చిన తరువాతే మెచ్యూర్ అవుతుంది. 10 ఏళ్ల కంటే తక్కువ వయస్సున్న అమ్మాయిల పేరుతో ఈ ఎక్కౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఇందులో ఏడాదికి గరిష్టంగా 1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ప్రస్తుతం అత్యధికంగా 8.2 శాతం వడ్డీ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏడాదికి 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే..మెచ్యూరిటీ తరువాత 69 లక్షల 27 వేల 578 రూపాయలు చేతికి అందుతాయి. అదే నెలకు 5000 చొప్పున ఏడాదికి 60 వేలు పెట్టుబడి పెడితే మీ అమ్మాయికి 21 ఏళ్లు నిండాక 27 లక్షల 71 వేల 31 రూపాయలు అందుతాయి.
ఇక మరో పధకం జనరల్ ప్రోవిడెంట్ ఫండ్. ఇందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. మీ అమ్మాయి మైనర్ అయితే తల్లిదండ్రుల పేరుతో ఎక్కౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఈ పధకంపై లభించే వడ్డీ 7.1 శాతం. గరిష్టంగా ఏడాదికి 1.5 లక్షల వరకూ పెట్టుబడి పెట్టేందుకు వీలుంటుంది. ఈ పథకం కాల వ్యవధి 15 ఏళ్లు. ఆ తరువాత వీలైతే ఇంకో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. ఏడాదికి 1.5 లక్షలు పెట్టుబడి పెడితే 15 ఏళ్లకు మీ అమ్మాయికి 40 లక్షల 68 వేల 209 రూపాయలు చేతికి అందుతాయి. అదే మరో ఐదేళ్లు పొడిగిస్తే మొత్తం 20 ఏళ్లు దాటాక 66 లక్షల, 58 వేల 288 రూపాయలు చేతికి వస్తాయి.
ఇక మరో ఆకర్షణీయమైన పధకం మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ పధకం 2023లో ప్రారంభమైంది. ఇందులో ఏ వయస్సు మహిళలైనా పెట్టుబడి పెట్టవచ్చు. అమ్మాయి మైనర్ అయితే తల్లిదండ్రులు ఎక్కౌంట్ ఓపెన్ చేయాలి. ఈ పధకంపై వడ్డీ 78.5 శాతం లభిస్తుంది. ఇందులో గరిష్ట పెట్టుబడి ఏడాదికి 2 లక్షల రూపాయలు. రెండేళ్ల కాల వ్యవధికి మెచ్యూర్ అవుతుంది. అంటే మీరు 2 లక్షలు పెట్టుబడి పెడితే రెండేళ్ల తరువాత 2 లక్షల 32 వేల 44 రూపాయలు చేతికి లభిస్తాయి.
Also read: Hyundai Motors: హ్యుండయ్ మోటార్స్ నుంచి త్వరలో ఐపీవో, ఆసక్తి చూపిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook