Mahindra Discount Offers: మహీంద్రా కంపెనీ కార్లకు ఎప్పుడూ ప్రత్యేక క్రేజ్ ఉంటుంది. ఇటీవల లాంచ్ చేసిన మహీంద్రా థార్ 5 డోర్ కావచ్చు లేదా మహీంద్రా థార్ రాక్స్ కావచ్చు మార్కెట్‌లో మంచి పట్టు సంపాదించాయి. ఇప్పుడు మహీంద్రా థార్ వెర్షన్‌లోనే 3 డోర్ వాహనంపై కంపెనీ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. కచ్చితంగా ఈ ఆఫర్ టెంప్టింగ్ ఆఫర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mahindra Thar Roxx లాంచింగ్‌తో పాటు  Mahindra Thar 3 Door వాహనంపై కంపెనీ బంపర్ డిస్కౌంట్ ఇస్తోంది. దసరా, దీపావళి పండుగల నేపధ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఉపయోగించుకుంటే కస్టమర్లకు చాలా వరకూ కలిసొస్తుంది. అయితే Mahindra XUV 300, Mahindra XUV 700, Mahindra Scorpio కార్లపై కంపెనీ ఎలాంటి డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించలేదు. కేవలం. మహీంద్రా థార్ 3 డోర్ వెర్షన్, ఇతర కార్లపై మాత్రమే ప్రత్యేక తగ్గింపు అందిస్తోంది. 


Mahindra XUV 400పై తగ్గింపు


ప్రస్తుతం ఒకే ఒక ఎలక్ట్రిక్ వాహనం మహీంద్రా ఎక్స్‌యూవీ 400పై కంపెనీ భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ కూడా టాప్ మోడల్ ఈఎల్ ప్రోకు వర్తిస్తుంది. ఇందులో 39.4 కిలోవాట్స్ బ్యాటరీ 456 కిలోమీటర్ల రేంజ్‌తో 7.2 కిలోవాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసేలా వస్తోంది. ఈ వాహనంపై ఏకంగా 3 లక్షల రూపాయలు డిస్కౌంట్ లభించనుంది. ఎక్స్‌యూవీ 400 ఎల్ ప్రో 34.5 కిలోవాట్స్ బ్యాటరీతో ఉంటుంది. ఈ వాహనం ప్రస్తుతం మార్కెట్‌లో నేరుగా టాటా నెక్సాన్ ఈవీతో పోటీ పడనుంది. ఇక ఎంజీ కంపెనీ త్వరలో లాంచ్ చేయనున్న విండ్సర్ కూడా పోటీ పడవచ్చు. ఎక్స్‌యూవీ 4900 ధర ప్రస్తుతం 16.74 లక్షల నుంచి 17.49 లక్షలు ఉంది. 


Mahindra Bolero Nioపై డిస్కౌంట్


మహీంద్రాకు చెందిన రెండు హై స్పేక్ ఎన్ 10, ఎన్10 ఓపీటీ వెర్షన్ కార్లపై 85 వేల రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. మిడ్ స్పేక్ మోడల్ ఎన్ 8పై 65 వేలు, ఎన్ 4పై 26 వేలు డిస్కాంట్ లభిస్తోంది. ప్రస్తుతం బొలేరో నియో ధర 9.95 లక్షల నుంచి 12.15 లక్షలుగా ఉంది.


Mahindra Boleroపై డిస్కౌంట్ ఆఫర్


ఇదొక టాప్ ఎండ్ బొలేరో బీ6 వాహనం. దీనిపై 90 వేల వరకూ డిస్కౌంట్ లభించనుంది. మిడ్ స్పేక్ బీ6 మోడల్ , ఎంట్రీ లెవెల్ అయితే 17 వేల రూపాయాలు తగ్గింపు ఉంటుంది. ఈ కారు 76హెచ్ ఇంజన్, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తుంది. బొలేరో మార్కెట్ ధర ప్రస్తుతం 9.79 లక్షల నుంచి 10.91 లక్షల వరకు ఉంది


Mahindra Scorpio Classicపై డిస్కౌంట్


ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. ఒకటి మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్ కాగా రెండవది మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ఎస్11. ఈ కారు ధర 13.62 లక్షల నుంచి 17.42 లక్షల వరకు ఉంది. ఈ నెలలో ఈ కారుపై ఏకంగా 20 వేల డిస్కౌంట్ పొందవచ్చు. 


Mahindra Tharపై డిస్కౌంట్


మహీంద్రా థార్ 3 డోర్ వెర్షన్‌లోని ప్రతి మోడల్ కారుపై గరిష్టంగా 1.5 లక్షల డిస్కౌంట్ లభించనుంది. కేవలం ఎంట్రీ లెవెల్ కారు AX OPT 2WDపై 1.36 లక్షల రూపాయలు డిస్కౌంట్ ఉంది. ఇది డీజిల్ మేన్యువల్ వెర్షన్ మాత్రమే. గేర్‌బాక్స్ కూడా మేన్యువల్. 152 హెచ్‌పి పవర్, 2 లీటర్ టర్బో పెట్రోల్‌తో వస్తుంది. 132 హెచ్ పి పవర్ అయితే 2.2 లీటర్ డీజిల్‌తో వస్తోంది. మహీంద్రా థార్ ప్రస్తుతం 11.35 లక్షల నుంచి 17.60 లక్షల రూపాయలుంది. ఈ కారు పోటీ మార్కెట్‌లో గోర్ఖా 3 డోర్ వాహనంతో ఉంది. ఇటీవల లాంచ్ అయిన మహీంద్రా థార్ 5 డోర్, మహీంద్రా రాక్స్ మధ్య కొద్దిగా తేడా ఉంది. మహీంద్రా థార్ 5 డోర్ వెర్షన్ ధర 12.99 లక్షల నుంచి 20.49 లక్షల వరకు ఉంది.


Also read: Bank Holiday: సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకులకు సెలవు, లాంగ్ వీకెండ్ కూడా ఎందుకో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.