Bank Holiday: సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకులకు సెలవు, లాంగ్ వీకెండ్ కూడా ఎందుకో తెలుసా

Bank Holiday: బ్యాంకు పనులుంటే వెంటనే పూర్తి చేసుకోండి. వచ్చేవారం అంటే సోమవారం దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ రోజు బ్యాంకులకు పబ్లిక్ హాలిడే ప్రకటించింది ఆర్బీఐ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 11, 2024, 02:11 PM IST
Bank Holiday: సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకులకు సెలవు, లాంగ్ వీకెండ్ కూడా ఎందుకో తెలుసా

Bank Holiday: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు ప్రతి నెలా బ్యాంకుల సెలవులు ప్రకటిస్తుంటుంది. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల సెలవుల జాబితా విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగానే వచ్చేవారం అంటే సెప్టెంబర్ 16 సోమవారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ఉంది. 

ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్‌లైన్ చెల్లింపులు, నగదు బదిలీలు జరుగుతున్నాయి. నగదు లావాదేవీల కోసం బ్యాంకులకు వెళ్లడం తగ్గిపోయింది. కానీ కొన్ని పనుల కోసం ఇప్పటికీ బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులున్నాయో తెలుసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాధారణంగా చాలామందికి సోమవారం బ్యాంకు పనులు ఎక్కువగా ఉంటుంటాయి. అయితే రానున్న వారం సెప్టెంబర్ 16 సోమవారం బ్యాంకు పనులుంటే కాస్త ఇబ్బందికరమే. ఎందుకంటే ఆ రోజు బ్యాంకులకు సెలవు ఉంది. వాస్తవానికి సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు 15 రోజులు సెలవులున్నాయి. ఈ సెలవుల్లో పబ్లిక్ హాలిడేస్‌తో పాటు నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగవ శనివారాలున్నాయి. వచ్చేవారం అంటే సెప్టెంబర్ 16న బ్యాంకులకు సెలవు ఎందుకు ఉందో తెలుసుకుందాం.

సెప్టెంబర్ 16 సోమవారం మీలాద్ ఉన్ నబీ పండుగ ఉంది. ముస్లింలకు అతి ముఖ్యమైన పండుగ ఇది. ప్రవక్త మొహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు. ఈ ఏడాది 2024లో మీలాద్ ఉన్ నబి లేదా ఈద్ ఎ మీలాద్ సెప్టెంబర్ 16న ఉంది. 

సెప్టెంబర్ నెలలో ఇప్పటికే బ్యాంకులకు గణేశ్ చతుర్ధి, శ్రీ నారాయణ గురు సమాధిరోజు, మహారాజా హరిసింగ్ జి పుట్టినరోజు, పాంక్ లాబ్సాల్ వంటి పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఇవి కాకుండా నాలుగు ఆదివారాలు, రెండు, నాలుగవ శనివారాలు ఉన్నాయి. 

సెప్టెంబర్ బ్యాంకు సెలవులు

సెప్టెంబర్ 4 త్రిభువన్ తిధి అస్సోంలో సెలవు
సెప్టెంబర్ 7 శనివారం గణేశ్ చతుర్ది బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 8 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 14 రెండవ శనివారం సెలవు
సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 16 మీలాద్ ఉన్ నబి సెలవు
సెప్టెంబర్ 17 ఇంద్రజాత్ర సిక్కిం, ఛత్తీస్ గఢ్‌లో సెలవు
సెప్టెంబర్ 18 పాంగ్ లాబ్సాల్ సిక్కింలో సెలవు
సెప్టెంబర్ 20 ఈద్ ఎ మీలాద్ జమ్ము కశ్మీర్‌లో సెలవు
సెప్టెంబర్ 21 శ్రీ నారాయణ గురు సమాధి కేరళలో సెలవు
సెప్టెంబర్ 22 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 23 సోమవారం మహారాజ హరిసింగ్ పుట్టినరోజు జమ్ము కశ్మీర్‌లో సెలవు
సెప్టెంబర్ 28 నాలుగవ శనివారం సెలవు
సెప్టెంబర్ 29 ఆదివారం సెలవు

ఈ సోమవారం మీలాద్ ఉన్ నబి సెలవుతో పాటు లాంగ్ వీకెండ్ ఉంది. అంతకు ముందు సెప్టెంబర్ 14 రెండో శనివారం, 15వ తేదీ ఆదివారం సెలవులున్నాయి. సెప్టెంబర్ 16 మీలాద్ ఉన్ నబి సెలవుతో వరుసగా మూడు రోజులు సెలవులున్నాయి

Also read: Infinix Zero 40: కేక పెట్టించే ఫీచర్లు, 108MP ప్రైమరీ, 50MP సెల్ఫీ కెమేరాతో ఇన్ఫినిక్స్ జీరో 40

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News