Mahindra Thar EV Launch Date: క్రమంగా భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్‌ కార్ల డిమాండ్‌ విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో లభించే ఎలక్ట్రిక్‌ SUVల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో ప్రముఖ టాటా మోటర్స్‌ ఆధిపత్యం కొనసాగుతోంది. ప్రతి సంవత్సరం మార్కెట్‌లో జరిగే కార్ల విక్రయాల్లో దాదాపు 65 శాతం వరకు టాటా మోటర్స్‌ వాటాలను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని దేశీ కార్ల కంపెనీలు కొత్త కొత్త కార్లను అతి తక్కువ ధరల్లోనే లాంచ్‌ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే మహీంద్రా మరో అడుగు ముందుకేసింది. గతంలో లాంచ్‌ చేసిన ఆఫ్-రోడింగ్ SUV థార్‌ను ఆప్డేట్‌ వేరియంట్‌లో భాగంగా ఎలక్ట్రిక్‌ మోడల్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అంతేకాకుండా ఇప్పటికే మహీంద్రా కంపెనీ ఈ థార్ EV కాన్సెప్ట్ (Mahindra Thar EV) మోడల్‌ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దక్షిణాఫ్రికాలో ప్రదర్శించినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకపోయిన కొన్ని న్యూస్‌ వెబ్‌సైట్‌లు వార్తలు ప్రచురించాయి. ఈ మహీంద్రా Thar.E కాన్సెప్ట్‌ను కంపెనీ 2026 లేదా 2027 సంవత్సర ప్రారంభంలో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఆఫ్-రోడింగ్ SUVకి సంబంధించిన ఫీచర్స్‌ ఏంటో, ధర పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.


డిజైన్ వివరాలు:
ఈ మహీంద్రా Thar.E కాన్సెప్ట్‌ డిజైన్‌ వివరాల్లోకి వెళితే, ఇది  3 ప్రత్యేకమైన LED స్ట్రిప్స్‌తో సెటప్‌లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రీమియం హెడ్‌ల్యాంప్‌లతో పాటు దీర్ఘచతురస్రాకార LED హౌసింగ్‌ సెటప్‌లను కలిగి ఉంటుంది. ఈ కారులో అద్భుతమైన బోల్డ్ ఫ్రంట్ బంపర్, చంకీ వీల్స్‌లను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఆఫ్-రోడింగ్‌కు అనుగుణంగా వీల్ ఆర్చ్ క్లాడింగ్, మస్కులర్ బానెట్ డిజైన్‌లను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కారు బ్యాక్‌ సెటప్‌ వివరాల్లోకి వెళితే, దీని బ్యాక్‌లో LED టెయిల్ ల్యాంప్ సిగ్నేచర్ హెడ్‌ల్యాంప్ యూనిట్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా స్పేర్ వీల్ బాక్సీ టెయిల్‌గేట్‌లతో రాబోతున్నట్లు తెలుస్తోంది.


ఇతర స్పెషిఫికేషన్స్‌:
ఈ Thar.E కాన్సెప్ట్‌ ఆఫ్-రోడింగ్ SUV కారును ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 450-500 కి.మీ వరకు మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 60kWh, 80kWh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మరెన్నో అద్భుమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతోంది. అయితే కంపెనీ దీనిని మార్కెట్‌లోకి 2026 ఏడాది చివరిలోని డిసెంబర్‌(Expected Launch)లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తే టాటా SUV కార్లతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.