COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Mahindra Xuv3Xo Price On Road: ప్రముఖ ఆటో మొబైల్‌ కంపెనీ మహీంద్రాకు మార్కెట్‌తో పేరు ఉంది. దీనిని ఇలాగే కంటిన్యూ చేసేందుకు ప్రతి సంవత్సర కొత్త కొత్త ఫీచర్స్‌తో SUV కార్లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. అయితే ఈ సంవత్సరం కూడా మహీంద్రా మరో కొత్త కారును విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. కంపెనీ దీనిని XUV3XO పేరుతో మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అలాగే కంపెనీ ఈ కారుకు సంంబంధించిన లాంచింగ్‌ తేదిని కూడా ప్రకటించింది. దీనిని మార్కెట్‌లో ఏప్రిల్ 29 నుంచి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వెల్లడించింది. ఈ XUV3XO SUV కారు ప్రీమియం ఫీచర్స్‌తో కస్టమర్స్‌కి అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ వంటి టాప్‌ బ్రాండ్స్‌ SUVలతో పోటీ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.


అలాగే ఈ కారుకు సంబంధించిన టీజర్‌ కంపెనీ ఇప్పటికే సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ మహీంద్రా XUV3XO కారు 7-స్పీకర్‌లతో కూడిన మ్యూజిక్ సిస్టమ్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ప్రీమియం టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇందులో సినిమాలు చూసేందుకు కూడా కొన్ని ప్రత్యేమైన ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే ఇది అనేక రకాల కనెక్టీవిటీలను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫ్రెష్ సెంటర్ కన్సోల్, కొత్త గేర్ లివర్ సెటప్‌తో లభిస్తోంది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ఇక ఈ మహీంద్రా XUV3XO కారు డిజైన్‌ వివరాల్లోకి వెళితే, ఇది కొత్త డిజైన్‌ అల్లాయ్‌ వీల్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన 1.2-లీటర్ టర్బో-పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్స్‌ను కలిగి ఉంటుంది. అలాగే ఇది 6 స్పీడ్ మాన్యువల్ యూనిట్ సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇక ధర విషయానికొస్తే ఇది రూ.9 లక్షల ఎక్స్-షోరూమ్ ధరలో ప్రారంభం కాబోతోంది. అయితే ఈ కారును వేరియంట్స్‌ను బట్టి ధరలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. 


టాప్ 10 మహీంద్రా XUV3XO ఫీచర్లు:
పెద్ద పానోరమిక్ సన్‌రూఫ్  
డ్యుయల్ టోన్ థీమ్‌లు
16-అంగుళాల అలాయ్ వీల్స్‌
LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌ల్యాంప్‌లు
టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
Apple CarPlay, Android Auto సపోర్ట్‌
వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌
కీలెస్ ఎంట్రీ & పుష్ బటన్ స్టార్ట్
డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్‌ సెటప్‌
ABS తో EBD బ్రేకింగ్ సిస్టమ్‌
ISOFIX చైల్డ్ సీట్ యాంకర్లు


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి