Maruti Alto Price Hiked: మధ్య తరగతి కుంటుంబం వారు చాలా వరకు బడ్జెట్‌ తక్కుగా ఉండే కార్లనే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతారు. ప్రస్తుతం మార్కెట్‌ తక్కువ ధరలతో ఎక్కువ ఫీచర్ల కార్లలో మారుతి ఆల్టో 800 ఒకటి.  అయితే ఇది మార్కెట్‌లోకి 2000 సంవత్సరంలో వచ్చిన్నప్పటికీ దీని రేంజ్‌ ఇంకా తగ్గలేదంటే గమనర్హం.. అయితే వినియోగదారులు ఇప్పటికీ ఈ కారును కొనుగోలు చేసేందు అసక్తి చూపుతున్నారు. అయితే ఇప్పుడు ఈ కారుకు సంబంధించిన షాకింగ్ న్యూస్‌ మీరు వినబోతున్నారు. కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి ఈ కారు ధరను పెంచుతూ మారుతీ సుజుకీ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు మార్కెట్ మారుతీ సుజుకీ ఆల్టో 800 ఎంతకు లభిస్తుంది. పెరిగిన ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మారుతి ఆల్టో 800 ధర పెంపునకు ముందు రూ.3.39 లక్షల నుంచి ప్రారంభం కాగా.. ఇప్పుడు మాత్రం రూ.3.54 లక్షల నుంచి మొదలవుతుంది. ఇంతకుముందు టాప్ ఎండ్‌ వేరియంట్ ధర రూ. 5.03 లక్షల నుంచి ప్రారంభం కాగా ఇప్పుడు మాత్రం రూ. 5.13 లక్షలు నుంచి ప్రారంభమవుతుంది. CNG వేరియంట్ దాదాపు ధర రూ. 10,000 పెంచుతూ నిర్ణయం తీసుకుంది మారుతీ సుజుకీ.. అయితే ఒక్క సారిగా 10,000 పెంచడంతో వినియోగదారులు అశ్చర్యపోతున్నారు. అయితే ఇప్పటికీ ధరలు పెంచడానికి గల కారణాలు తెలియలేదు.


మారుతి సుజుకి ఆల్టో డిసెంబర్‌ నెలలో విచ్చల విడిగా అమ్ముడుపోయింది. ఇది (O), LXi(O), VXi, VXi+ అనే నాలుగు వేరియంట్‌లలో లభిస్తోంది. CNG కిట్ దాని LXI(O) వేరియంట్‌లో హై ఎండ్‌ వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో 0.8-లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్స్‌తో అందుబాటులో ఉన్నాయి. పెట్రోల్‌ వేరియంట్‌ కారైతే పెట్రోల్‌పై 48 PS/69 Nm, CNG పై 41 PS/60 Nm లను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.


ఆల్టో 800 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా అందుబాటులో ఉంది.  ఇది ఆండ్రాయిడ్, ఆపిల్ కార్‌ప్లే సఫోర్ట్‌ కూడా లభిస్తుంది. ఇది కీలెస్ ఎంట్రీ, ఫ్రంట్ పవర్ విండోస్ వంటి ఫీచర్లను కూడా ఇందులో పొందవచ్చు. డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఈబీడీతో కూడిన ఏబీఎస్ వంటి ఫీచర్లు కూడా కారులో అందుబాటులో ఉన్నాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)


Also Read: Tax Saving Schemes 2023: ఈ పథకంలో పెట్టుబడి పెట్టండి.. ఆదాయంతోపాటు సూపర్ బెనిఫిట్స్  


Also Read: Shubman Gill: ఉప్పల్‌లో పరుగుల ఉప్పెన.. చరిత్ర సృష్టించిన శుభ్‌మన్ గిల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి