2024 Maruti Suzuki Dzire: దేశంలోని ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ చరిత్రను స్రుష్టించింది. కంపెనీ తన కొత్త కాంపాక్ట్ సెడాన్ కారు మారుతి డిజైర్‌ను వచ్చే వారం విడుదల చేయబోతోంది. అయితే  లాంచ్ కాకముందే, కారు సేఫ్టీ పరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కారును వచ్చే వారం  నవంబర్ 11న విడుదల చేస్తున్నారు.ధర కూడా లాంచింగ్ సమయంలోనే వెల్లడించనుంది కంపెనీ. ఈ కారు గ్లోబల్ NCAP నుండి కార్ క్రాష్ టెస్టింగ్‌లో 5 స్టార్ రేటింగ్ ను అందుకుంది. గ్లోబల్ నుంచి 5 స్టార్ రేటింగ్ పొందిన మొదటి మారుతి కారుగా నిలిచింది. మారుతి ఈ కొత్త డిజైనర్ క్రాష్ టెస్టింగ్ కోసం గ్లోబల్ NCAPకి స్వచ్చందంగా పంపించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక భద్రతకు సంబంధించి 34 పాయింట్లకు గాను ఈ కొత్త డిజైర్ 31.24 పాయింట్స్ ను స్కోర్ చేసింది. గ్లోబల్ NCAP రిపోర్టు ప్రకారం..ఈ కారులో డ్రైవర్, ప్రయాణికులకు అందించిన హెడ్ అండ్ నెక్ ప్రొటెక్షన్ బాగుంది. అయితే డ్రైవర్ చెస్ట్ సేఫ్టీ మాత్రం  అంతంత మాత్రమేనని చెప్పవచ్చు. ఇక ఫ్రంట్ ప్యాసింజర్ ప్రొటెక్షన్ సరిపోతుంది. డ్రైవర్, ప్రయాణికుల మోకాలుకు కూడా ఈ కారులో ప్రొటెక్షన్ బాగున్నట్లు టెస్ట్ లో చూపించింది. 


Also Read: Business Ideas: మహిళలు ఒక్కరూపాయి పెట్టుబడి లేకుండా ..ప్రతినెలా లక్ష వరకు సంపాదించే బిజినెస్ ఇదే  


ఇక పిల్లల సేఫ్టీకి సంబంధించి డిజైర్ 42 పాయింట్స్ గాను 39.20 పాయింట్లు  సాధించింది. ISOFIX ఎంకరేజ్స్ లను ఉపయోగించి ఇన్ స్టాల్ చేసిన మూడేళ్ల పిల్లల కోసం ఫార్వర్డ్ ఫేసింగ్ చైల్డ్ సీటు, ఫ్రంటల్ తాకిడి సమయంలో అధిక ఫార్వర్డ్ మోషన్ ను కంట్రోల్ చేయగలిగింది. తల, ఛాతీకి సేఫ్టీ అందిస్తుంది. కానీ మెడకు ఈ కారులో లిమిటెడ్ ప్రొటెక్షన్ ఉన్నట్లు గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టుల్లో వెల్లడైంది. 


ISOFIX ఎంకరేజ్ లను ఉపయోగించి ఇన్ స్టాల్ చేసిన 18నెలల వయస్సు గల పిల్లల కోసం బ్యాక్ సైడ్ ఉన్న చైల్డ్ సీటు, ఫ్రంటల్ తాకిడి సమయంలో తల ప్రమాదంలో పడకుండా కంట్రోల్ చేస్తుంది. ఇది ఫుల్ సేఫ్టీని అందిస్తుంది. సీఆర్ఎస్ ఇస్టాలేషన్ ప్రమాద సమయంలో 18నెలల చిన్నారులు, మూడేళ్ల పిల్లలకూ ఈ కారు ఫుల్ సేఫ్టీ ఇస్తుందని పరీక్షలో చూపించింది. 


ఇక గ్లోబల్ ఎన్ క్యాప్ టెస్ట్ చేసిన మారుతీ డిజైర్ లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్ సీ అన్ని సీట్లకు రిమైండర్ తో కూడిన 3 పాయింట్ సీట్ బెల్ట్స్ , బ్యాక్ ఔట్ బోర్డ్ సీట్లకు  ISOFIX మౌంట్స్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రస్తుతం పరీక్షించిన ఈ మోడల్ దేశీయ మార్కెట్ కోసం భారత్ లో తయారు చేశారు. 


Also Read: ​Money Tips:  ప్రతినెలా వచ్చే జీతం సరిపోవట్లేదా..అయితే ఉద్యోగం చేస్తూనే ఈ పనిచేస్తే మీ ఆదాయం పెరగడం ఖాయం  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.