Business Ideas: మహిళలు మీరు వ్యాపారంతో పాటు సమాజ సేవ కూడా చేయాలని అనుకుంటున్నారా. ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాం. ఈ బిజినెస్ ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు, సమాజంలో గుర్తింపు కూడా పొందుతారు. అలాగే ప్రతి నెల చక్కటి ఆదాయం కూడా లభిస్తుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Business Ideas: ప్రస్తుత కాలంలో బిజీ బిజీ జీవితంలో తల్లిదండ్రులను అందులోనూ వయసు మళ్ళిన వాళ్లను కుటుంబంలో పట్టించుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశంగా మారుతుంది. వారిని వృద్ధాశ్రమంలో వేయడం వంటివి చేస్తే సమాజంలో చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. అలా అని వారి సేవ కోసం మీ వద్ద సమయం లేకపోవడం అనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఈ సమస్య నుంచి బయటపడేందుకు, హౌస్ కీపర్ వ్యవస్థ చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఎవరైనా వృద్ధులు కానీ, యాక్సిడెంట్ల వల్ల మంచానికే పరిమితమైన వాళ్ళు కానీ, ఆపరేషన్ నుంచి కోరుకుంటున్నారు కానీ, ఎముకలు విరిగిన వారు కానీ, తమ సేవలు తాము చేసుకోలేని సమయంలో ఈ హౌస్ కీపింగ్ సర్వీసు ద్వారా చక్కటి సర్వీసు పొందవచ్చు.
ఇందుకోసం మార్కెట్లో అనేక రకాల హౌస్ కీపింగ్ ఏజెన్సీలు అందుబాటులో ఉన్నాయి. దీన్నే మీరు ఒక వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం మీరు చేయవలసింది ఒకటే పని ముందుగా మీరు ఒక ఏజెన్సీ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో మీరు ఈ హౌస్ కీపింగ్ సర్వీసెస్ కోసం యువతీ యువకులను, ఆరోగ్యకరమైన వారిని అందుబాటులో ఉంచుకోవాలి.
వీరికి ప్రతినెల వేతనం అందించేలా మీరు ఒప్పందం కుదుర్చుకోవాలి. అయితే నేర ప్రవృత్తి కలవారిని, అలాగే సరిగ్గా పని చేయలేని వారిని మీరు అందుబాటులో ఉంచుకుంటే మీ వ్యాపారం దెబ్బ తినే ప్రమాదం ఉంటుంది. ఇక హౌస్ కీపింగ్ యువతి యువకులకు మీరు శిక్షణ అందించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు ఎమర్జెన్సీ సమయంలో సిపిఆర్ ఇవ్వడము, అదేవిధంగా బ్యాండేజ్ వేయడము, ప్రాథమిక చికిత్స చేయడము వంటివి నేర్పించాలి. మీరు ఈ ఏజెన్సీ ద్వారా హౌస్ కీపర్ల ను నియమించుకున్న వారి నుంచి ప్రతినెల ఫీజు రూపంలో డబ్బు పొందవచ్చు. అందులో కొంత మొత్తం మీరు కమిషన్ గా తీసుకొని మిగిలిన మొత్తాన్ని హౌస్ కీపింగ్ వ్యక్తికి వేతనంగా ఇస్తే సరిపోతుంది.
అయితే ఈ ఏజెన్సీ కోసం మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రభుత్వం వద్ద నుంచి అన్ని రకాల అనుమతులు పొందాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఈ వ్యాపారంలో చక్కగా రాణించే అవకాశం లభిస్తుంది.