Maruti Swift Dzire vs Tata Tigor Comparison: పవర్‌ఫుల్ ఫీచర్లు, స్టైలిష్‌ డిజైన్‌ మారుతి డిజైర్ కారు భారత్‌ మార్కెట్‌లోకి గత సోమవారం ఎంట్రీ ఇచ్చింది. ఈ మోడల్‌లో కస్టమర్ల కోసం ఇంటీరియల్ సన్‌రూఫ్‌, 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో వచ్చేసింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఈ కారుకు పోటీగా చాలా కార్లు పోటీగా ఉన్నా.. కొత్త డిజైర్‌ను టాటా టిగోర్‌తో పోల్చి చూద్దాం.. కాంపాక్ట్ సెడాన్ కేటగిరీలో ఈ రెండూ పోటీగా ఉండనున్నాయి. మారుతి డిజైర్ కారు 1.2-లీటర్ Z సిరీస్ పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులో ఉంది. 5,700 rpm వద్ద 82 bhp పవర్‌ను, 4,300 rpm వద్ద 112 Nm టార్క్‌ను అందిస్తుంది. దీని ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఇక టాటా టిగోర్ విషయానికి వస్తే.. 1.2-లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 85 bhp,  113 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో కూడా మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: YS Jagan Mohan Reddy: జగన్ బెయిల్ రద్దుపై విచారణలో సంచలనం.. ధర్మాసనం ఏం చెప్పిందంటే..?  


మైలేజ్ విషయానికి వస్తే.. మారుతి డిజైర్ పెట్రోల్ మోడల్ దాదాపు 25-26 కిమీ/లీటర్ మైలేజీని ఇస్తేంది. తక్కువ బరువు, అధునాతన Z-సిరీస్ ఇంజిన్ కారణంగా ఎక్కువ మైలేజ్ వస్తుంది. టాటా టిగోర్ కాస్త తక్కువ మైలేజీతో వస్తుంది. 20-22 కిమీ/లీటర్ మైలేజీని అందిస్తుంది. సెక్యూరిటీ ఫీచర్స్‌లో మారుతి డిజైర్ కొత్త డిజైర్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా ఈ కారు గ్లోబల్ NCAP పరీక్షలో 5 స్టార్ రేటింగ్‌ సాధించింది. ఇక టాటా టిగోర్  గ్లోబల్ NCAP టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ పొందింది. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, EBDలతో స్ట్రాంగ్ బాడీ నిర్మాణంతో ఉంటుంది.


క్యాబిన్, కంఫర్ట్‌లో మారుతి డిజైర్ కారుకు ఎక్కువ ప్లస్ పాయింట్స్‌ ఉన్నాయి. విశాలమైన ఇంటీరియర్స్, ఎక్కువ లెగ్ రూమ్, హెడ్ రూమ్‌తోపాటు బ్యాక్‌సైడ్ ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. వెనుక భాగంలో కూడా ఎయిర్ కండీషనర్ వెంట్ల సౌకర్యం ఉంటుంది. ఆర్మ్ రెస్ట్ కప్ హోల్డర్‌లతో పాటు ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్ కూడా డిజైన్ చేశారు. 9 ఇంచెస్ టచ్ స్క్రీన్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. టాటా టిగోర్ విషయానికి ఇంటీరియర్ నాణ్యత చాలా బెటర్‌గా డిజైన్‌గా చేశారు. హర్మాన్ మ్యూజిక్ సిస్టమ్, వెనుక సీటు సౌకర్యం ఎక్కువగానే ఉంటుంది. కానీ మారుతి డిజైర్‌తో పోలిస్తే ఎక్కువ స్పెస్ ఉండదు. ధర విషయానికి వస్తే.. మారుతి డిజైర్ ధర రూ.6.79 లక్షల నుంచి రూ.10.14 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది. టాటా టిగోర్ ధర రూ.5.99 లక్షల నుంచి 7.79 లక్షల రూపాయలు ఉంటుంది. 


Also Read: Tragic Incident: ప్రేమతో భార్య చికెన్‌ బిర్యానీ పెట్టగా.. తెల్లారేసరికి శవమైన భర్త



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి