RDE Norms in New Cars: మారుతి సుజుకి, హోండా, హ్యూండాయ్, టాటా, రెనాల్ట్ లాంటి ఫేమస్ బ్రాండ్స్‌కి చెందిన 17 కార్లు ఇండియన్ మార్కెట్‌కి గుడ్‌బై చెప్పనున్నాయా ? 2023 నుంచి ఈ 17 రకాల మోడల్ కార్లు ఇండియాలో విక్రయాలు నిలిపేయాల్సిందేనా ? ఆటోమొబైల్ ఇండస్ట్రీవర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం ఆ కార్లకు రోజులు దగ్గరపడ్డాయనే టాక్ వినిపిస్తోంది. ఇదే విషయం ప్రస్తుతం ఆయా కంపెనీల యజమానులకు, డీలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకు కారణం విక్రయాలు నిలిచిపోనున్న ఆ 17 కార్లలో చాలామందికి నచ్చిన ఫేవరైట్ కార్లు ఉండటమే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

17 రకాల కార్ల విక్రయాలు ఎందుకు నిలిచిపోనున్నాయి. 
రియల్ డ్రైవింగ్ ఎమిషన్‌కి సంబంధించి కొత్త నిబంధనలు తెరపైకి వస్తున్నాయి. రియల్ డ్రైవింగ్ ఎమిషన్‌ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. ఈ కొత్త నిబంధనల ప్రకారం కార్లలో కాలుష్య ఉద్గారాలను నియంత్రణలో ఉంచేలా సెల్ఫ్-డయాగ్నస్టిక్ సిస్టం వ్యవస్థను కార్లలో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది. వివిధ దశల్లో ఈ సెల్ఫ్-డయాగ్నస్టిక్ సిస్టం వ్యవస్థ పనిచేస్తుంటుంది. 2023 ఏప్రిల్ 1 నుంచి ఆర్డీఈ కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. 


వాహనాలతో పెరుగుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగానే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. BS-6 రకం వాహనాల్లో ఇది రెండో దశగా ఆటోమొబైల్ మేకర్స్ అభివర్ణిస్తున్నారు. కార్ల తయారీ కంపెనీలు ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా కార్ల తయారీని మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా రియల్ డ్రైవింగ్ ఎమిషన్ కొత్త నిబంధనలు కారణంగా ఆయా కార్ల మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ కూడా భారీగా పెరగనుంది. ఈ కార్లు ఇండియన్ మార్కెట్‌కి దూరం కావడానికి ఇది మరో కారణం కానుందని తెలుస్తోంది. 


అయితే వివిధ కారణాల వల్ల సెల్ఫ్-డయాగ్నస్టిక్ సిస్టం అప్‌గ్రేడేషన్ సాధ్యపడని వాహనాలు వచ్చే ఏడాది ఏప్రిల్ తరువాత ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌కి దూరం కానుండటమే ఆయా కార్ల తయారీదారులకు తలనొప్పిగా మారింది. ఇండియన్ మార్కెట్ కి దూరం కానున్న వాహనాల్లో మారుతి సుజుకి ఆల్టో 800, హోండా WR-V, రెనాల్టా క్విడ్ 0.8L, హోండా జాజ్, హోండా సిటి ఫోర్త్ జనరేషన్, టొయోటా ఇన్నోవా క్రిస్టా, మహింద్రా కేయూవీ 100, మహింద్రా అల్టురాస్ G4, మహింద్రా మరాజో, నిసాన్ కిక్స్, స్కోడా సూపర్బ్, స్కోడా ఆక్టేవియా వంటి వాహనాలు ఆ జాబితాలో ఉన్నాయి. ఇవే కాకుండా హోండా అమేజ్, టాటా ఆల్ట్రోజ్, హోండా సిటీ, హ్యూండాయ్ వెర్నా, హ్యూండాయ్ i20 వంటి డీజిల్ వెర్షన్ కార్ల విక్రయాలు కూడా ఇబ్బందుల్లో పడనున్నాయి. ఈ నిబంధనలు అమలులోకి రానంత వరకు ఈ కార్ల విక్రయాలకు డోకా లేనప్పటికీ.. ఒకసారి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయంటే ఆ కార్లు షోరూంలలో కనపడవని తెలుస్తోంది.


ఇది కూడా చదవండి : Share Market: పుంజుకున్న మార్కెట్, గ్రీన్ కలర్‌తో క్లోజ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు


ఇది కూడా చదవండి : PF Account: పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.. ఇలా అస్సలు చేయకండి


ఇది కూడా చదవండి : BH Series Numbers: బీహెచ్ సిరీస్ ఉంటే చాలు..దేశంలో ఎక్కడైనా తిరిగేయవచ్చు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook