BH Series Numbers: బీహెచ్ సిరీస్ ఉంటే చాలు..దేశంలో ఎక్కడైనా తిరిగేయవచ్చు

BH Series Numbers: నిన్నటి వరకూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు రీ రిజిస్ట్రేషన్ తప్పదు. ఇప్పుడిక ఆ అవసరం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీహెచ్ సిరీస్ లాంచ్ అయింది. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 18, 2022, 11:12 PM IST
BH Series Numbers: బీహెచ్ సిరీస్ ఉంటే చాలు..దేశంలో ఎక్కడైనా తిరిగేయవచ్చు

ఇక నుంచి మీ పాత కారులో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రంలో ఏ విధమైన రీ రిజిస్ట్రేషన్ లేకుండా తిరగవచ్చు. చేయాల్సిందల్లా బీహెచ్ సిరీస్ నెంబర్ తీసుకుంటే చాలు..ఎక్కడైనా తిరగవచ్చు. రోడ్డు, రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు అనుమతచ్చింది.

రాష్ట్రాల మధ్య వ్యక్తిగత వాహనాల బదిలీకై కేంద్ర రోడ్లు రవాణా రహదారుల శాఖ 2021లో బీహెచ్ నెంబర్ సిరీస్ ప్రారంభించింది. ఈ నెంబర్ ప్లేట్ ఉంటే వాహనదారులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి బదిలీ అయినప్పుడు రీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. గత ఏడాది ప్రారంభమైన ఈ బీహెచ్ సిరీస్ నిన్నటి వరకూ కేవలం కొత్త వాహనాలకే పరిమితమై ఉండేది. ఇప్పుడిక పాత కార్లకు కూడా బీహెచ్ సిరీస్ నెంబర్ పొందవచ్చు. 

బీహెచ్ సిరీస్ వ్యవస్థను విస్తృతం చేసేందుకు రోడ్డు రవాణా, రహదారుల శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. సాధారణ రిజిస్ట్రేషన్ నెంబర్లు కలిగి వాహనాలను ఇకపై బీహెచ్ సిరీస్‌లో మార్చుకోవచ్చు.  అయితే దీనికోసం అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రక్షణ రంగం, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు బీహెచ్ నెంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా దేశంలో 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో ఉనికి కలిగిన మల్టీ నేషనల్ కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also read: Share Price: ఐటీ రంగంలో ఇన్వెస్టర్లకు ముంచేసిన ఆ 3 కంపెనీల షేర్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News