Maruti Suzuki Fronx Car Expected Price & Launch Date: మారుతి సుజుకీ కంపెనీ వచ్చే నెలలో భారత మార్కెట్లో పోటీని పెంచబోతోంది. మారుతి  కంపెనీ మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Fronx) కారును విడుదల చేయనుంది. ఇది మారుతి బాలెనో ఆధారంగా రూపొందించబడింది. అయితే ఇది మరింత స్టైలిష్ లుక్ మరియు మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తుంది. మారుతి ఫ్రాంక్స్ ఇంజన్ రెండు ఎంపికలతో రానుంది. 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటాయి. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్.. సిగ్మా, డెల్టా మరియు డెల్టా ప్లస్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 1.0 లీటర్ మైల్డ్ హైబ్రిడ్ టర్బో పెట్రోల్ ఇంజన్.. డెల్టా ప్లస్, జీటా మరియు ఆల్ఫా వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Suzuki Fronx Features:


మారుతి సుజుకీ ఫ్రాంక్స్ యొక్క బేస్ వేరియంట్ సిగ్మా. ఇది మారుతి బాలెనోపై ఆధారపడి ఉంటుంది. ఈ కారణంగా అన్ని వేరియంట్ల ఫీచర్లు మారుతి బాలెనో మాదిరిగానే ఉండబోతున్నాయి. మారుతి ఫ్రాంక్స్ సిగ్మా (బేస్ మోడల్) ధరను అంచనా వేయడానికి ముందు..  బాలెనో సిగ్మా ధర రూ. 6.56 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), 60-40 స్ప్లిట్ వెనుక సీట్‌బ్యాక్, వీల్ కవర్లతో కూడిన పెద్ద 16 అంగుళాల స్టీల్ వీల్స్, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HSA), 5x సర్దుబాటు చేయగల వెనుక హెడ్‌రెస్ట్‌లు, 5x 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, స్కిడ్ ప్లేట్ మరియు క్లాడింగ్, షార్క్-ఫిన్ యాంటెన్నా ఫీచర్లు ఉన్నాయి. 


Maruti Suzuki Fronx Price:


బాలెనోలో ఉండే ఈ ఫీచర్లు కాకుండా.. మారుతి సుజుకీ ఫ్రాంక్స్ ఫ్రంట్‌లో ఆకర్షణీయమైన లుక్‌లు, మెరుగైన గ్రౌండ్ క్లియరెన్స్ మరియు తక్కువ బూట్ స్పేస్ కలిగి ఉంటాయి. దీని కోసం మారుతి సుజుకి కంపెనీ అదనంగా రూ. 40000 వసూలు చేయవచ్చు. అంటే మారుతి ఫ్రాంక్స్ సిగ్మా బేస్ మోడల్ ధర దాదాపు రూ. 6.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండవచ్చు. దాదాపుగా 7 లక్షల లోపు ధరకే మారుతి కంపెనీ ఫ్రాంక్స్ కారుని లాంచ్ చేసే అవకాశం ఉంది.


Maruti Suzuki Fronx Launch:
మీడియా నివేదికల ప్రకారం... మారుతి సుజుకి నెక్సా 'ఫ్రాంక్స్' ధరలను 2023 ఏప్రిల్ 7 నాటికి ప్రకటిస్తుంది. ఫ్రాంక్‌ల బుకింగ్‌లు జనవరిలో ప్రారంభమయ్యాయి. Tata Punch, Nissan Magnite, Renault Kiger, Tiago NRG మరియు Citroën C3 కార్లతో మారుతి ఫ్రాంక్‌ పోటీ పడనుంది.


Also Read: Maruti Suzuki Brezza CNG 2023: 9 లక్షలకే ఈ సూపర్ ఎస్‌యూవీని ఇంటికి తీసుకెళ్లండి.. మైలేజ్ 25 కిమీ కంటే ఎక్కువ!  


Also Read: IND vs AUS 3rd ODI Tickets: భారత్-ఆస్ట్రేలియా మూడో వన్డే.. టికెట్స్ కోసం ఫాన్స్ బారులు! దుప్పట్లు కప్పుకుని క్యూ లైన్‌లోనే కునుకు  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి