COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maruti Suzuki Swift 2024: ప్రముఖ భారత ఆటో‌ కంపెనీ మారుతీ సుజుకి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆప్డేట్‌ వేరియంట్‌లో స్విఫ్ట్‌ 2024ను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ధర రూ. 6.49 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. మారుతి ఈ కార్లలను Z సిరీస్ ఇంజిన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతేకాకుండా ఇది అద్భుతమైన మైలేజీని కూడా కలిగి ఉంటుంది. ఇప్పటికే కార్ల బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఈ కారును కొనుగోలు చేయాలనుకునేవారు ముందుగా రూ.11,000 టోకెన్ చెల్లించి బుకింగ్‌ను చేసుకోవాల్సి ఉంటుంది. 


భద్రతా ఫీచర్స్‌:
మారుతి సుజుకి ఈ కొత్త స్విఫ్ట్ 2024 కారును ప్రీమియం సెఫ్టీ ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ కారు  హిల్ హోల్డ్ కంట్రోల్ సెటప్‌లో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు కంపెనీ ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌ సెటప్‌ను కూడా అందించింది. దీంతో పాటు ఎంతో శక్తివంతమైన 6 ఎయిర్‌బ్యాగ్‌లను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు అద్భుతమైన క్రూయిజ్ కంట్రోల్ సెటప్‌,  యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇవే ఈ కారు ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), బ్రేక్ అసిస్ట్ (BA) వంటి భద్రతా ఫీచర్స్‌ కూడా కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.


ఇంటీరియర్:
ఇక ఈ కొత్త స్విఫ్ట్ 2024 ఇంటీరియర్ విషయానికొస్తే, ఇది విలాసవంతమైన క్యాబిన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా కంపెనీ ఈ కారులోని వెనక భాగంలో ఏసీ వెంట్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది వైర్‌లెస్ ఛార్జర్‌తో పాటు డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్‌లను కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ప్రోటెక్షన్‌ కోసం ప్రత్యేక కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అలాగే 9-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు ఇది ప్రత్యేకమైన డ్యాష్‌బోర్డ్‌లను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా స్క్రీన్ వైర్‌లెస్ కనెక్టివిటీతో Android Autoతో పాటు Apple CarPlay సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


ధర వివరాలు:
ఈ కొత్త స్విఫ్ట్ 2024 కారు వివిధ రకాల వేరియంట్స్‌తో అందుబాటులోకి వచ్చింది. కంపెనీ అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం ఈ కారు LXi, VXi, VXi (O), ZXi, ZXi+తో పాటు ZXi+ వేరియంట్స్‌లో మార్కెట్‌ లభిస్తోంది. దీంతో పాటు ఈ వేరియంట్స్‌లోని LXi బేస్‌ వేరియంట్‌ 6.49 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇక టాప్‌ ఎండ్‌ మోడల్‌ ZXi డ్యూయల్ టోన్ ధర రూ. 9.64 లక్షల (ఎక్స్-షోరూమ్)తో లభిస్తోంది. ఇక ఈ కారుకు సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే, ఆటోమేటిక్ FE వేరియంట్‌ 25.75kmpl మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. 


Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి