Maruti Suzuki: మారుతి సుజుకి నుంచి త్వరలో 5 కొత్త కార్లు, బడ్జెట్ 10 లక్షల్లోపే
Maruti Suzuki: అందుకే మారుతి సుజుకి మార్కెట్‌లో పట్టు మరింతగా సంపాదించేందుకు , కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు కొత్త కార్లను తీసుకురానుంది. త్వరలో 5 కొత్త మోడల్ కార్లు లాంచ్ చేయాలని భావిస్తోంది. ధర కూడా 10 లక్షల్లోపే ఉండవచ్చు. వీటి గురించి తెలుసుకుందాం.
Maruti Suzuki: మారుతి సుజుకి కొత్త మోడల్ కార్లను ప్రవేశపెట్టేందుకు యోచిస్తోంది. మార్కెట్‌లో ఉన్న వివిధ కంపెనీల కార్లకు పోటీగా కొత్తగా 5 కార్లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆధునీకరించిన ఫ్రంట్, సరికొత్త డిజైన్, న్యూ జనరేషన్ బలేనో, న్యూ మైక్రో ఎస్‌యూవీ, కాంపాక్ట్ ఎస్‌యూవీ వంటి కార్లను ప్లాన్ చేస్తోంది.
న్యూ జనరేషన్ బలేనో
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మారుతి సుజుకి కార్లతో బాగాక్లిక్ అయిన కారు బలేనో. దీనికి కొత్త వెర్షన్‌గా రానుంది. ఇది ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. ఈ కారు హైబ్రిడ్ ఇంజన్‌తో వస్తోంది. 2026లో లాంచ్ కావచ్చని సమాచారం. ఇప్పుడు ఉన్న బలేనోతో పోలిస్తే ఇది పూర్తిగా డిఫరంట్ లుక్ కలిగి ఉంటుంది.
న్యూ మారుతి సుజుకి డిజైర్
మరి కొద్ది నెలల్లో మార్కెట్‌లో లాంచ్ కానుంది. మారుతి సుజుకి డిజైర్ గురించి అందరికీ తెలిసిందే. బాగా క్లిక్ అయిన కారు ఇది. ఇప్పుడీ కారును మరింతగా ఆధునీకరించి సరికొత్త రూపంతో తీసుకొస్తోంది. డిజైన్ ఆకర్షణీయంగా ఉంటుంది. ఇంటీరియర్ ఆధునికంగా ఉండబోతోంది. ఈ సెడాన్ మోడల్ కారు 1.2 లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తోంది. ఇది 82 బీహెచ్‌పి పవర్, 112 ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఇందులో మేన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. ఇందులో సీఎన్జీ వెర్షన్ కూడా ఉంది.
మారుతి ఫ్రాంట్ ఫేస్‌లిఫ్ట్
ఈ కొత్త మోడల్ ఫ్రాంట్ వచ్చే ఏడాది అందుబాటులో రావచ్చు. ఈ కారు ప్రత్యేకత ఏంటంటే హైబ్రిడ్ ఇంజన్ కలిగి ఉంటుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. పాత మోడల్‌తో పోలిస్తే కారు డిజైన్, ఇంటీరియర్‌లో చిన్న చిన్న మార్పులు ఉండవచ్చు.
మారుతి న్యూ మైక్రో ఎస్‌యూవీ
ఇది పూర్తిగా కొత్తగా రానుంది. లాంచ్ అయ్యేందుకు చాలా సమయం పట్టవచ్చు. 2026-27 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశాలున్నాయి. టాటా పంచ్, హ్యుండయ్ ఎక్స్‌టర్ కార్లను పోలి ఉంటుంది. లాంచ్ అయ్యాక కూడా ఈ కార్లతో పోటీ పడవచ్చు.
న్యూ మారుతి కంపాక్ట్ ఎస్ యూవీ
మారుతి కంపాక్ట్ ఎస్ యూవీ మార్కెట్ లో లాంచ్ అయ్యేందుకు కొంత సమయం పట్టవచ్చు. 2026లో లాంచ్ అయ్యేందుకు అవకాశాలున్నాయి. ప్రస్తుతం కంపెనీ వైడీబీ అనే కోడ్ నేమ్ ఇచ్చింది. ఇందులో మూడు వరుసల సిట్టింగ్ ఉంటుంది. మారుతి సుజుకి ఎర్టిగా, సుజుకి ఎక్స్ ఎల్ 6 కంటే తక్కువ లైనప్ కలిగి ఉంటుంది. ఈ కారు 1.2 లీటర్ జెడ్ సిరీస్ పెట్రోల్ ఇంజన్ తో రానుంది.
Also read: Vande Bharat Sleeper Ticket: వందేభారత్ , వందేభారత్ స్లీపర్, మెట్రో రైళ్ల టికెట్ ఎంత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.