Maruti Swift @ Rs 4 Lakhs: రూ.4 లక్షలకే మారుతీ స్విఫ్ట్‌ని ఇంటికి తీసుకెళ్లండి.. రోడ్ టాక్స్ కూడా అవసరం లేదు
Get Maruti Swift Diesel Under @ Rs 4 Lakhs: అమ్మకానికి అందుబాటులో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ కార్లు మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో ఉన్నాయి.
Buy Maruti Swift Just @ Rs 4 Lakhs: 2023 ఫిబ్రవరిలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా 'మారుతి స్విఫ్ట్' నిలిచింది. దీన్నిబట్టి మారుతి స్విఫ్ట్ కారుకి ప్రజల్లో ఎంత ఆదరణ ఉంటుందో అంచనా వేయవచ్చు. మీరు కూడా మారుతి స్విఫ్ట్ కారును కొనుగోలు చేయాలనుకుంటే.. మీ వద్ద భారీ మొత్తం లేకుంటే అస్సలు చింతించాల్సిన అవసరం లేదు. కొత్త కారు కాకుండా పాత మారుతి స్విఫ్ట్‌ను తక్కువ ధరలో కొనుగోలు చేయొచ్చు. అమ్మకానికి అందుబాటులో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ మారుతి స్విఫ్ట్ కార్లు మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. ఈ కార్లకు రోడ్ టాక్స్ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
Maruti Swift VDI:
2020 రిజిస్ట్రేషన్‌తో మారుతి స్విఫ్ట్ వీడిఐ ధర మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో రూ. 4.99 లక్షలుగా ఉంది. ఫరీదాబాద్‌లో కారు అమ్మకానికి ఉంది. ఈ కారు మొదటి యజమాని వద్ద ఉండగా.. ఇందులో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఈ కారు రీడింగ్ కేవలం 12417 కిలోమీటర్లు మాత్రమే.
Maruti Swift LXI:
మరో మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ 2020 రిజిస్ట్రేషన్ గల కారు ధర రూ. 5.25 లక్షలుగా ఉంది. ఈ కారు గునాలో అమ్మకానికి ఉంది. ఈ కారు మొదటి యజమాని ఉండగా.. పెట్రోల్ ఇంజన్ ఇందులో ఉంది. ఈ కారు మొత్తం 137712 కిలోమీటర్లు ప్రయాణించింది.
Maruti Swift LXI:
మరో మారుతి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ కారు ధర మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో రూ. 5.30 లక్షలు. 2020 రిజిస్ట్రేషన్ గల ఈ కారు మీరట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. పెట్రోల్ ఇంజన్ గల ఈ కారు రీడింగ్ 38450 కిమీగా ఉంది.
Maruti Swift VDI:
మారుతి సుజుకి ట్రూ వాల్యూ వెబ్‌సైట్‌లో ఉన్న 2019 మారుతి స్విఫ్ట్ వీడిఐ ధర రూ. 5.80 లక్షలు. జోధ్‌పూర్‌లో ఈ కారు అమ్మకానికి ఉంది. రెండవ యజమాని వద్ద ఉన్న ఈ కారు మొత్తం 38490 కిమీ నడించింది. ఇందులో డీజిల్ ఇంజన్ కలదు.
Also Read: MS Dhoni: ఎంఎస్ ధోనీ నా ఆస్తులు ఏం తీసుకోలేదు.. పూర్తి క్లారిటీ ఇచ్చిన హర్భజన్ సింగ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి