Discount on MG Cars: MG కార్లపై రూ.1.50 లక్షలకు పైగా తగ్గింపు.. లాస్ట్ డేట్ జూన్ 30 వరకే.. త్వరపడండి!
Rs 1 lakh Discount on MG Astor ZS EV Hector: ప్రముఖ మోటార్స్ కంపెనీ ఎంజీ తన కార్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. మార్కెట్లో విక్రయాలు పెరగడం కారణంగా ఈ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే ఈ డిస్కౌంట్ ల ద్వారా ఎంతవరకు తగ్గింపు లభిస్తుందో.. వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Rs 1 Lakh Discount on MG Astor ZS EV Hector: ప్రముఖ మోటార్స్ కంపెనీ ఎంజీ తనకార్ల విక్రయాలపై భారీ తగ్గింపును అందివ్వబోతోంది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 25% పైగా సేల్స్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నెలలో MG తమ కార్లపై రూ.1.50 లక్షల తగ్గింపు అందివ్వబోతోందని ప్రకటించింది. 2022లో 4,008 యూనిట్లను విక్రయించింన ఈ కంపెనీ..2023లో ఈ సంఖ్య 5,006 యూనిట్లకు పెరిగింది. అంతేకాకుండా భారత మార్కెట్లో MG కంపెనీకి విశేష గుర్తింపు లభించింది. మున్ముందు యూనిట్లను పెంచబోతున్నట్లు కూడా సమాచారం.
Aster, ZS EV, హెక్టర్ ప్లస్ కార్లు కొనుగోలు చేస్తే బంపర్ డిస్కౌంట్ అందించబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. Aster 1.5 NA వేరియంట్‌పై రూ. 75,000 వరకు, ఎలక్ట్రిక్ కారు ZS EVపై కంపెనీ రూ. 1.5 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా మరికొన్ని మోడల్స్ పై కూడా తగ్గింపు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇటీవలే ఎంజీ విడుదల చేసిన ఎలక్ట్రిక్ కార్లకు మార్కెట్లో మంచి డిమాండ్ లభించింది. దీనిని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే కొత్త పేరెంట్లతో కూడిన కార్లను విడుదల చేస్తారని కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఎంజీ కంపెనీ తెలిపింది.
Also Read: Viral Video: ఇదేందయ్యా ఇది..నేనెప్పుడూ చుడలే..! పామును తిన్న జింక, వీడియో వైరల్
త్వరలోనే JSW గ్రూప్ వాటాను కొనుగోలు చేయనుంది:
ఎంజీ మోటార్స్ కంపెనీ వాటాలను JSW గ్రూప్ కొనుగోలు చేయబోతున్నట్లు అధ్యక్షుడు సజ్జన్ జిందాల్ తెలిపారు .MG మోటార్ ఇండియా షాంఘై ఆధారిత SAIC మోటార్ అనుబంధ సంస్థ కావడంతో కొనుగోలు చేసేందుకు వీలున్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ లో పేర్కొన్నారు. సజ్జన్ జిందాల్ MG మోటార్ ఇండియాలో 45 నుంచి 48% వాటాను తీసుకునే అవకాశాలు ఉన్నాయని అందులో తెలిపారు. అంతేకాకుండాఎంజీ కంపెనీలో పని చేసే భారతీయ ఉద్యోగులందరికీ కంపెనీలో 5-8% వాటాను ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ డీల్ కు సంబంధించిన చట్టపరమైన ఒప్పందాల జరిగినట్లు తెలుస్తోంది.
వచ్చే రెండు నుంచి మూడు నెలలు అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని 4 నెలలోపు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు ఉన్నట్లు ఎకనామిక్స్ టైమ్స్ లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఒప్పందంతో రెండు కంపెనీలు కొత్త బ్రాండ్ ను సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే SAIC ఇప్పటికే భారతదేశంలో దాదాపు రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టింది. మరిన్ని పెట్టుబడులకు కూడా సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది.
Also Read: 4X4 SUV Cars : 4X4 SUV సెగ్మెంట్‌లో తక్కువ ధరలో లభించే కారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి