Microsoft CEO Satya Nadella's 26-year-old son dies​: మైక్రోసాఫ్ట్‌  సీఈవో సత్యనాదెళ్ల (Microsoft CEO Satya Nadella) ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమారుడు జైన్‌ నాదెళ్ల (26) కన్నుమూశారు. పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతున్న జైన్‌ (Zain Nadella)..  అమెరికా కాలమానం ప్రకారం సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారు. ప్రపంచంలోని దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్ తాజాగా ఈ విషయాన్ని  ధృవీకరించింది.  సత్య నాదెళ్ల కుమారుడు ఇక లేరని... ఎగ్జిక్యూటివ్ స్టాఫ్‌కు ఇమెయిల్ పంపింది. అక్టోబర్ 2017లో, సత్య నాదెళ్ల ఒక బ్లాగ్‌పోస్ట్‌లో తన కొడుకు పుట్టిక గురించి వెల్లడించారు. జైన్ ఆగస్ట్ 13, 1996న రాత్రి 11:29కి జన్మించినట్లు ఆ బ్లాగ్ లో పేర్కొన్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెరిబ్రల్ పాల్సీ (cerebral palsy) అంటే.. పుట్టుకతోనే బ్రెయిన్ దెబ్బతింటుంది. దీంతో బ్రెయిన్‌కు కాళ్లు, చేతులపై నియంత్రణ ఉండదు. దీనితో బాధపడుతున్నవారు వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. సత్యనాదెళ్లకు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. సత్య నాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వైకల్యం కలిగిన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించే ఉత్పత్తుల రూపకల్పనపై  దృష్టి సారించారు. జైన్ నాదెళ్ల ..చిల్డ్రన్స్ హాస్పిటల్ అయిన సీటెల్ చిల్డ్రన్స్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ బ్రెయిన్ రీసెర్చ్‌  లో చాలా కాలంపాటు చికిత్స తీసుకున్నారు. ఈ ఆస్పత్రి పీడియాట్రిక్ న్యూరోసైన్సెస్‌లో జైన్ నాదెల్లా ఎండోడ్ చైర్‌ను స్థాపించడానికి నాదెల్లాతో గత ఏడాది ఈ హాస్పిటల్ చేతులు కలిపింది.


Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్‌ని తక్షణమే ఈయూలో చేర్చుకోండి.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook