Microsoft passes Apple: యాపిల్‌ను దాటేసి అత్యంత విలువైన లిస్టెడ్ కంపెనీగా మైక్రోసాఫ్ట్
Microsoft M-cap: మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటల్ యాపిల్ కంపెనీని దాటేసింది. అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ ప్రకారం మైక్రోసాఫ్ట్ విలువ 2.49 ట్రిలియన్ డాలర్లకు చేరింది.
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరో రికార్డును (Microsoft new record) సాధించింది. మార్కెట్ క్యాపిటల్ (ఎం-క్యాప్) పరంగా అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. లగ్జరీ గాడ్జెట్స్ తయారీ సంస్థ యాపిల్‌ను దాటుకుని మైక్రోసాఫ్ట్ ఈ ఘనతను సాధించింది.
అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీల ప్రకారం.. మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటల్ (Microsoft M-cap) 2.49 ట్రిలియన్ డాలర్లుగా తెలిసింది. మన కరెన్సీలో ఈ విలువ రూ.186.5 లక్షల కోట్లకు పైమాటే.
ఇదే సమయంలో యాపిల్ మార్కెట్ (Apple Market value) క్యాపిటల్ 2.46 ట్రిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిసింది. భారత కరెన్సీ ప్రకారం యాపిల్ విలువ రూ.184.2 లక్షల కోట్లు.
Read Alos: JioPhone Next: జియోఫోన్ నెక్ట్స్ గురించి బిగ్ అప్డేట్- ధర, ఫీచర్ల వివరాలు వెల్లడి
Read Alos: Petrol Price today: దేశంలో ఆగని పెట్రో మంట - రికార్డు స్థాయికి ధరలు
ఫలితాల్లో యాపిల్ డీలా- మైక్రోసాఫ్ట్ భళా..
గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) ప్రకటించిన త్రైమాసిక ఫలితాల్లో యాపిల్ నిరాశ పరిచింది. దీనితో అమెరికా స్టాక్ ఎక్స్ఛేంజీ నాస్డాక్ శుక్రవారం సెషన్లో కంపెనీ షేరు భారీగా పతనమైంది.
జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ యాపిల్ 20.60 బిలియన్ డాలర్ల లాభాలన్ని గడించింది. నికర ఆదాయం 83.4 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది.
శుక్రవారం ఒక్క రోజే కంపెనీ షేరు 2.76 శాతం నష్టపోయింది. దీనితో షేర విలువ 149.81 వద్దకు చేరింది.
ఇదే సమయంలో మైక్రోసాఫ్ట్ షేరు 7.27 శాతం పుజుకుంది. దీనితో షేరు విలువ 331.62 వద్దకు పెరిగింది. ఫలితంగా మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటల్ యాపిల్‌ను దాటింది.
జులై-ఆగస్టు మధ్య మైక్రోసాఫ్ట్ (Microsoft results 2021) 17 బిలియన్ డాలర్ల లాభాన్ని గడించింది. వాల్‌స్ట్రీట్ అంచనాలను మించి ఈ స్థాయి లాభాలను నమోదు చేసింది. క్రితంతో పోలిస్తే ఈ లాభాలు 24 శాతం అధికమని మైక్రోసాఫ్ట్ వివరించింది.
అమెరికాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ షేర్లు కూడా శక్రవారం సెషన్లో 2.15 శాతం నష్టపోయాయి. దీనితో కంపెనీ మార్కెట్ క్యాపిటల్ (Amazon Market capital) 1.71 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. మన కరెన్సీలో ఈ విలువ రూ.128 లక్షల కోట్లకుపై మాటే.
Also read: EPF interest: ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్- త్వరలోనే ఖాతాల్లో వడ్డీ జమ!
Also read: IRCTC Share News Today: కేంద్రం నిర్ణయంతో పడిలేచిన ఐఆర్‌సీటీసీ షేర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook