Money Tips: ప్రతినెలా వచ్చే జీతం సరిపోవట్లేదా..అయితే ఉద్యోగం చేస్తూనే ఈ పనిచేస్తే మీ ఆదాయం పెరగడం ఖాయం
Money Tips: నేటికాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గడపవచ్చు. అయితే పెరుగుతున్న ఖర్చులు పెరుగుతుండటం..ఆదాయం తగ్గుతుండటంతో భార్యభర్తలు ఇద్దరు పనిచేసినా..డబ్బులు మిగలనివారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఉద్యోగం చేస్తూనే కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మీ జీతం కంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అదేంటో చూద్దాం.
Money Tips: చాలా మంది నెలా నెలా వచ్చే జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. నేటికాలంలో భారీగా ఖర్చులు పెరుగుతున్నాయి. ఖర్చులకు తగ్గట్లుగా ఆదాయం ఉంటేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నెలంతా కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బు కనీస అవసరాలను కూడా తీర్చకుంటే జీవితం భారంగా మారుతుంది. అయితే కొంతమంది మాత్రం ఉద్యోగం చేస్తూనే అదనపు ఖర్చుల కోసం ఇతర పనులు చేస్తుంటారు. ఇంకొంత మంది ఉద్యోగం మానేసి బిజినెస్ ప్రారంభించాలి అనుకుంటారు. అయితే అదనపు డబ్బు సంపాదించేందుకు ఉద్యోగం మానేయాల్సిన అవసరం లేదు. ఉద్యోగం చేస్తూనే చిన్న చిన్న చిట్కాలు పాటించినట్లయితే జీతం కంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు.
స్టాక్ మార్కెట్స్ లేదా ఫండ్స్:
మీకు స్టాక్ మార్కెట్ పట్ల ఆసక్తి ఉన్నట్లయితే అదనపు ఆదాయాన్ని సంపాదించేందుకు ఇది మంచి మార్గం. మంచి స్టాక్స్ లో పెట్టుబడి పెట్టి మంచి లాభం పొందే అవకాశం ఉంటుంది. అయితే స్టాక్ మార్కెట్ రిస్కుతో కూడినది. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ ను అంచనా వేసి పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. తక్కువ రిస్క్ ఉంటే చాలు అనుకున్నట్లయితే..మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ నుంచి యావరేజ్ గా 12 నుంచి 13శాతం రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మార్కెట్ పాజిటివ్ గా ఉంటే అధిక లాభాలు కూడా రావచ్చు.
ఈ -బుక్స్ :
మీకు రైటింగ్ అంటే ఇష్టమైతే..ఇ బుక్స్ రాయడం, ఆన్ లైన్లో అమ్మడం బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇ బుక్ ను పూర్తి చేసిన తర్వాత అదనపు పని లేకుండా ఏడాదిపాటు డబ్బు సంపాదించవచ్చు. మీ నాలెడ్జ్ ను షేర్ చేసుకుంటూ ఇ బుక్స్ ద్వారా ఎక్స్ ట్రా ఇన్ కమ్ సంపాదించడం కూడా అద్భుతమైన ఆలోచన. రాయడం ఇష్టపడే వ్యక్తులు, గ్లోబల్ ఆడియకన్స్ కు రీచ్ అవ్వాలనుకుంటే ఇదే బెస్ట్ ఆప్షన్.
ఏంజెల్ ఇన్వెస్టర్ :
అందరికీ బిజినెస్ చేయడం రాదు. మీకు అదనపు ఆదాయం కావాలంటే మీరే ఏంజెల్ ఇన్వెస్టర్ గా స్టార్టప్ లలో ఇన్వెస్ట్ చేయవచ్చు. భవిష్యత్తులో విజయం సాధిస్తాం అనే నమ్మకంతో కొత్త ఆలోచనలు, బిజినెస్ లకు సహకారం అందించండి. స్టార్టప్ విజయం సాధించినట్లయితే..మీ పెట్టుబడి భారీగా పెరుగుతుంది. కొన్నిసార్లు 100 నుంచి 200 రెట్లు లాభాలు కూడా వస్తాయి. ఏంజెల్ ఇన్వెస్టర్ గా ఉండటం బిజినెస్ రోజువారీ కార్యకలాపాల్లో భాగం కాకుండానే లాభాలను కూడా పొందవచ్చు.
మ్యూజిక్ లేదా మూవీ రాయల్టీలో ఇన్వెస్ట్ మెంట్:
అదనపు ఆదాయాన్ని సంపాదించేందుకు మరొక ప్రత్యేకమైన మార్గం మ్యూజిక్ లేదా సినిమా రాయల్టీలలో పెట్టుబడి పెట్టడం. చాలా మంది ఆర్టిస్టులు తమ ఫ్యూచర్ రాయల్టీల్లో కొంత భాగాన్ని పెట్టుబడిదారులకు విక్రయిస్తారు. ఈ రాయల్టీల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా, మ్యూజిక్ లేదా సినిమా ఆదాయాన్ని సంపాదించిన ప్రతిసారీ మీరు దాంట్లో కొంత భాగాన్ని తీసుకుంటారు. మీరు మ్యూజిక్ లేదా సినిమాలు తీయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పటికే ఉన్న వర్స్క్ లో పెట్టుబడి పెట్టే ఛాన్స్ వెతకడం, ఫ్యూచర్ రాయల్టీల నుంచి అందే ఆదాయాన్ని ఆస్వాదించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.