Moto G22: దేశంలో కొవిడ్ సంక్షోభం భారీగా తగ్గిన నేపథ్యంలో స్మార్ట్​ఫోన్​ తయారీ కంపెనీలు జోరు పెంచాయి. వరుసగా కొత్త కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం లెనోవాకు చెందిన మోటొరోలా.. నేడు బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్​ఫోన్​న్​ను విడుదల చేసింది. మోటో జీ22 పేరుతో విడుదల చేసిన ఈ కొత్త స్మార్ట్​ఫోన్​ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోటో జీ22 ఫీచర్లు..


ఈ ఫోన్​ను బడ్జెట్ ధరలో తెచ్చినప్పటికీ.. ప్రీమియం ఫీచర్లు పొందుపరచడం విశేషం. 6.53 అంగుళాల భారీ డిస్​ప్లేతో ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇది హెచ్​డీ ప్లస్​ (1600x720 పిక్సెల్​ రెసొల్యూషన్​) పిక్చర్ క్వాలిటీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది.


మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెసర్​తో ఈ ఫోన్ పని చేస్తుంది.


వెనకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. అందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్​తో రానుంది. మిగతా లెన్స్​లు 8 మెగా పిక్సెల్​, 2 మెగా పిక్సెల్​, 2 మెగా పిక్సెల్​గా ఉండనున్నాయి.


ఇందులో 16 ఎంపీ సెల్ఫీ కెమెరాను పొందు పరిచింది మోటోరోలా.


ఇక ఈ ఫోన్​లో 5000 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీని పొందుపరిచింనట్లు చెప్పింది మోటోరోలా. ఇది 20 వాట్స్​ ఫాస్ట్​ ఛార్జింగ్​ను సపోర్ట్​ చేస్తుంది.


ఆండ్రాయిడ్​ 12 స్టాక్​ ఆండ్రాయిడ్​పై పని చేస్తుంది. అంటే ఈ ఫోన్​లో యాడ్స్​ రావు.



ధర ఎంత?


4 జీబీ ర్యామ్​+64 జీబీ స్టోరేజ్​ వేరియంట్ ధరను రూ.10,999గా నిర్ణయించింది కంపెనీ. అయితే ఆరంభ ఆఫర్​ కింద రూ.9,999కి తగ్గించింది. ఈ స్మార్ట్​ఫోన్ విక్రయాలు ఏప్రిల్ 13 నుంచి ఫ్లిప్​కార్ట్ ద్వారా ప్రారంభం కానున్నాయి.


Also read: Stock Markets: మూడు రోజుల నష్టాలకు బ్రేక్​- బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాలు..


Also read: Google Play Store: ప్లేస్టోర్‌లో అప్‌డేట్ ఇవ్వని యాప్‌లకు గూగుల్ షాక్‌...!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook