Moto G42 Price: మోటో జి 42 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతోంది. అద్భుతమైన ఫీచర్లతో ఎకానమీ ధరలో లభించనుంది. మోటో జి42 ఫీచర్లు, ధర, ఎప్పట్నించి అమ్మకాలు ప్రారంభం కానున్నాయనే వివరాలు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మోటో జి 42 కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అవుతోంది. 15వేలలో మంచి స్మార్ట్‌ఫోన్ కావాలనుకుంటే..ఇదే మీకు మంచి ప్రత్యామ్నాయం కాగలదు. ప్రపంచంలో తొలి ఫోన్ అందించిన మోటోరోలా కంపెనీ మోటో జి 42ను ఇండియాలో జూలై 4న అంటే ఇవాళ లాంచ్ చేసింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర కూడా పెద్దగా లేదు. 15 వేలకంటే తక్కువకే ఆకర్షణీయమైన ఫీచర్లతో, స్టైలిష్ డిజైన్‌తో అందుబాటులో రానుంది. మోటో జి42 ప్రత్యేకత ఏంటి, ధర ఎంత, ఎక్కడ కొనుగోలు చేయాలో పరిశీలిద్దాం..


ఇండియాలో మోటో జి 42 స్మార్ట్‌ఫోన్ లాంచ్


మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మోటో జి42 ఇవాళ అంటే జూలై 4న లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లు కలిగిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇది. అద్భుతమైన డిజైన్, ఎమోల్డ్ డిస్‌ప్లే, మంచి ప్రోసెసర్, ట్రిపుల్ రేర్ కెమేరా ఇందులో ఉన్నాయి. 15 వేల రూపాయల కంటే తక్కువకే ఈ స్మార్ట్‌ఫోన్ రెండు రంగులు మెటాలిక్ రోజ్, అట్లాంటిక్ గ్రీన్‌లో లభిస్తున్నాయి. 


మోటోరోలా ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ మోటో జి42 ఒకే వేరియంట్‌లో అందుబాటులో తీసుకొస్తోంది. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తోంది. ఫ్లిప్‌కార్డ్‌లో జూలై 11 మద్యాహ్నం 12 గంటల్నించి అందుబాటులో వస్తోంది. ఈ ఫోన్ ధర 13 వేల 999 రూపాయలుగా ఉంది. ఫ్లిప్‌కార్ట్ అడిషన్ ఆఫర్ కూడా వర్తిస్తుంది. ఫ్లిప్‌కార్డ్‌లో మోటో జి42ను 13 వేల 999 రూపాయల కంటే తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 1000 రూపాయలు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దాంతో 12 వేల 999 రూపాయలకే ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది. 


మోటో జి42 ఫీచర్లు


మోటో జి42 స్మార్ట్ ఫోన్ 6.47 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ఎమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామ్రధ్యంతో పాటు 20 వాట్స్ టర్బో ఫాస్ట్ ఛార్జర్ సౌకర్యముంది. క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రోసెసర్‌పై పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌‌‌ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉంది. 1 టీబీ వరకూ పెంచుకోవచ్చు. ఇందులో ట్రిపుల్ రేర్ కెమేరా అదనపు ఆకర్షణగా ఉంది. ఇందులో 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ వైడ్ అండ్ డెప్త్ కెమేరా, 2 ఎంపీ మైక్రో సెన్సార్ కెమేరా ఉన్నాయి. ఇక సెల్ఫీ కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమేరా మరో ఆకర్షణ.


Also read: iPhone SE 3 Free: ఉచితంగా 5జీ ఐఫోన్‌.. వెరిజోన్‌లో ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook