iPhone SE 3 Free: ఉచితంగా 5జీ ఐఫోన్‌.. వెరిజోన్‌లో ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా!

iPhone SE 3 Free Offer.  ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఒకటి వెరిజోన్‌లో అందుబాటులో ఉంది. వెరిజోన్‌లో ఫ్రీగా ఐఫోన్ ఎస్‌ఈ 3ని పొందవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 4, 2022, 11:18 AM IST
  • ఉచితంగా 5జీ ఐఫోన్‌
  • వెరిజోన్‌లో ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా
  • ఎస్‌ఈను ఒక మోడల్ కాదు
iPhone SE 3 Free: ఉచితంగా 5జీ ఐఫోన్‌.. వెరిజోన్‌లో ఫ్రీగా ఎలా పొందాలో తెలుసా!

Buy iPhone SE 3 for free in Verizon: ప్రపంచంలో 'ఆపిల్ ఐఫోన్' అంటే ఇష్టపడని వారు ఉండరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొత్త సిరీస్ వచ్చిందంటే మొబైల్ ప్రియులు కొనుగులు చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. ముఖ్యంగా సరసమైన ధరలో అందుబాటులో ఉన్న మూడో జనరేషన్ ఐఫోన్ ఎస్‌ఈ 3 కోసం అందరూ ఎదురుచూస్తునారు. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి మైండ్ బ్లోయింగ్ ఆఫర్ ఒకటి వెరిజోన్‌లో అందుబాటులో ఉంది. వెరిజోన్‌లో ఫ్రీగా ఐఫోన్ ఎస్‌ఈ 3ని పొందవచ్చు. 

ఐఫోన్ 12 మినీ ఫ్లాగ్‌షిప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కంటే తక్కువ ధరకు ఐఫోన్ ఎస్‌ఈ 3 లభిస్తుంది. ఇప్పటివరకు అత్యంత సరసమైన 5G ఐఫోన్‌గా ఇది మాత్రమే మార్కెట్లోలో ఉంది. A15 బయోనిక్ చిప్‌సెట్ కారణంగాఈ ఫోన్ శక్తివంతమైన డిస్‌ప్లేతో పనిచేస్తుంది. అద్భుతమైన పని తీరుతో పాటు సుదీర్ఘ బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్ కెమెరా క్వాలిటీ కూడా బాగుంది. దీని ధర రూ. 33,948. తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన ఎంపిక. 

చాలా మంది ఐఫోన్ ఇతర ఫోన్ మోడల్స్‌ తరహాలోనే ఎస్‌ఈను ఒక మోడల్ అనుకుంటారు. కానీ ఎస్‌ఈ ఓ స్పెషల్ ఎడిషన్‌. యాపిల్ ఫ్లాగ్‌షిప్‌ మోడళ్లకు భిన్నంగా.. అందరికీ అందుబాటు ధరలో ఒక ఫోన్‌ను తీసుకురావాలనే ఉద్దేశంతో ఎస్‌ఈను పరిచయం చేసింది. ఐఫోన్ ఎస్‌ఈ 3కి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే మీ సొంతం చేసుకోవచ్చు. వెరిజోన్ ఈ క్రేజీ డీల్‌ను మీకు అందిస్తోంది. అది కూడా ఎలాంటి ట్రేడ్-ఇన్ డీల్ లేకుండా. ఈ క్రేజీ డీల్‌ను ఇలా పొందాలి. 

# ముందుగా వెరిజోన్ వెబ్‌సైట్‌కు వెళ్ళాలి.
# మీకు నచ్చిన iPhone SE 3 కలర్, వేరియంట్‌ని ఎంచుకోండి
# ఆపై యాడ్ న్యూ లైన్‌పై క్లిక్ చేయండి
# ఇప్పుడు కంటిన్యూపై క్లిక్ చేసి.. నూతన వినియోగదారు ఎంపికను ఎంచుకోండి
# మీరు మీ జిప్ కోడ్‌ను నమోదు చేసి లొకేషన్‌ను నిర్ధారించాల్సి ఉంటుంది. 
# ఆ వెంటనే మీకు పలు వెరిజోన్ ప్లాన్‌లు అందుబాటులో ఉంటాయి. iPhone SE 3ని ఉచితంగా పొందేందుకు 36 నెలల ప్లాన్ ఎంచుకోండి.
# iPhone SE 3 మీకు షిప్పింగ్ చేయబడుతుంది

Also Read: ఫెమినా మిస్ ఇండియాగా సిని శెట్టి.. నాలుగో స్థానంలో తెలంగాణ అమ్మాయి! ప్రత్యేక ఆకర్షణగా మిథాలీ

Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు శుభవార్త.. హైదరాబాద్‌లో నేటి బంగారం, వెండి ధరలు ఇవే!  

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News