తిరిగి తన స్థానాన్ని కైవసం చేసుకున్న ముకేష్ అంబానీ...ఆసియాలో అపర కుబేరుడుగా నిలిచి రిలయన్స్ అధినేత
Mukesh ambani రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ తిరిగి తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. సంపదనలో తనను ఈ మధ్య దాటేసిన గౌతమ్ అదానీని వెనక్కి నెట్టి మళ్లీ మొదటి స్థానంలో నిలిచారు. షేర్ మార్కెట్లో ఆర్‌ఐఎల్ షేర్లకు తెగ డిమాండ్ ఏర్పడడంతో మళ్లీ తన స్థానాన్ని చేజిక్కించుకున్నారు. రిలయన్స్ షేర్ల ధరలు దూకుడు ప్రదర్శించడం... అంబానీ షేర్లు క్షీణించడం ముకేష్ అంబానీకి కలిసి వచ్చింది. ప్రస్తుతం తాజా లెక్కల ప్రకారం ముకేశ్ ఆస్థి 7.74 లక్షల కోట్లుగా నమోదు అయ్యాయి. 7.66 లక్షల కోట్లతో అదానీ రెండో స్థానంలో నిలిచారు. సంపదను పోగు చేసుకోవడంతో ఇలా ఈ ఇద్దరు ఐశ్వర్యవంతులు పోటీ పడుతూ అందర్ని ఆకర్శిస్తున్నారు.
ఆర్‌ఐఎల్ షేరు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 3 శాతం పెరుగుదల నమోదు చేసింది. దీంతో వారం రోజుల్లో ఏకంగా పద్నాలు శాతం వృద్ధి చెందింది. దీంతో రిలయెన్స్ షేరు ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరింది. ఏకంగా 2,855 రూపాయలు పలుకుతోంది. గత కొంత కాలంగా మిగతా సంస్థల షేర్లను కొనుగులో చేస్తున్న రిలయన్స్ .... వాల్‌గ్రీన్స్ బూట్స్ అలియంజ్‌కు చెందిన కెమిస్ట్ , డ్రగ్ స్టోర్ యూనిట్లకు బిడ్ వేసిందని వార్తలు రావడంతో ఒక్కసారిగా రిలయన్స్ షేర్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. డెబ్బై వేల కోట్లతో రిలయన్స్ బిడ్ వేసినట్లు సమాచారం.
దీనికి తోడు రష్యా నుంచి రిలయన్స్ చవక ధరలకు చమురు కొనుగోలు చేయడం కూడా ఇందుకు అనుకూలిస్తోంది. చవకగా దిగుమతి చేసుకొని అంతర్జాతీయ మార్కెట్లో రిఫైనరీ ఉత్పత్తులను అమ్ముతోంది. తద్వారా కూడా గణనీయమైన లాభాలు రిలయన్స్ కు అందుతున్నాయి. ఉక్రెయిన్ పై దాడిని ఖండిస్తున్న అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేశాయి.ఇక తమ చమురు అవసరాల కోసం అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్రో రిఫైనరీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. దీంతో రిలయన్స్ పెట్రో ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడి లాభాల పంట పండుతోంది. ఇలా పలు కారణాలతో ముకేష్ అంబానీ ఆస్థులు అమాంతం పెరిగిపోయాయి.
also read Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు
also read PF Balance: పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునేందుకు నాలుగు విధానాలివే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook