Mukesh Ambani Highest paid salary : ముఖేష్ అంబానీ కంటే అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగి ఎవరో తెలుసా?
Reliance Highest Paid Employee: రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యధిక శాలరీ ఎవరు తీసుకుంటున్నారా అని ఆలోచిస్తున్నారా? అయితే అందుకు సమాధానం లభించింది. ఆయన అంబానీ కుటుంబానికి వారసుడైతే కాదు. కానీ ఆయన వారసులకన్నా ఎక్కువ జీతం పొందుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
Reliance Highest Paid Employee : ఆసియాలోనే అత్యంత ధనవంతుడు అపరకుబేరుడు ముఖేష్ అంబానీ గురించి ఏ వార్త అయినా సరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఆయన కంపెనీ రిలయన్స్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో అత్యధిక శాలరీ ఎవరికి చెల్లిస్తున్నారు అనే విషయంపై జోరుగా చర్చ నడుస్తోంది అయితే దీనికి సమాధానం ? ఎవరా అని ఆలోచిస్తున్నారా..? ఇంకెవరు ఉంటారు ఆయన సతీమణి నీతా అంబానీ, లేదా ఆయన కుమారులు ఆకాష్, అనంత్ అంబానీలు అయి ఉంటారని మీరంతా అనుకోవచ్చు. కానీ ఇక్కడే మీరు పప్పులో కాలు వేశారు అని అర్థం.
ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఒక రూపాయి కూడా శాలరీ లేకుండా పనిచేస్తున్నారు. మరి అత్యంత ఎక్కువ శాలరీ తీసుకునే ఎంప్లాయ్ ఇవ్వరా అని ఆలోచిస్తున్నారా. అందుకు సమాధానం లభించింది. ఆయన మరెవరో కాదు. అతడి పేరు హితల్ మేస్వానీ. ఈయన ఏటా 24 కోట్ల రూపాయలకు పైగా పారితోషికం అందుకుంటున్నాడు. హితల్ మేస్వానీ ముఖేష్ అంబానీకి అలాంటి సన్నిహితుడు.రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అత్యధిక జీతం తీసుకుంటున్న ఉద్యోగిగా పేరు పొందారు.
Also Read : Repo Rate : కీలక వడ్డీరేట్లలో మార్పులు లేవు..రుణగ్రహీతలకు లభించని ఊరట..!!
ప్రస్తుతం రూ.19,74,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థలకు హితల్ మేస్వానీ బోర్డ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. హితల్ అంబానీ కుటుంబంలోని సభ్యుల కంటే ఎక్కువ వార్షిక వేతనం పొందుతున్నాడు. గతంలో ధీరుభాయ్ అంబానీకీ హితల్ తండ్రి రసిక్ భాయ్ మేస్వానీ అత్యంత సన్నిహితుడు. ఇప్పుడు ఆయన కుమారుడు ముఖేష్ అంబానీకి సన్నిహితుడుగా మారారు. నిజానికి ముఖేష్ అంబానీ వ్యాపార ప్రపంచంలోకి ప్రవేశించినప్పుడు, హితల్ తండ్రి రసిక్ భాయ్ మెస్వానీ మార్గనిర్దేశనం చేశారు. అప్పట్లో రిలయన్స్ గ్రూప్ ముఖేష్ అంబానీ తండ్రి ధీరూభాయ్ నాయకత్వంలో ఉండేది.
కంపెనీలో హితల్ ప్రయాణం ఎలా మొదలైంది?
ఇక హితల్ మెస్వానికి అంబానీ కుటుంబంతో బంధుత్వం కూడా ఉంది. హితల్ తండ్రి రసిక్ భాయ్ ధీరూభాయ్ అంబానీకి స్వయంగా మేనల్లుడు. అతను రిలయన్స్ వ్యవస్థాపక డైరెక్టర్లలో ఒకరు. ముఖేష్‌కు మార్గనిర్దేశం చేసే బాధ్యతను సైతం రసిక్ భాయ్ కే అప్పగించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ పాలిస్టర్ విభాగాన్ని రసిక్‌భాయ్ పర్యవేక్షించారు.
ఇప్పుడు రసిక్‌భాయ్ కుమారుడు హితల్ మెస్వానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో అత్యధిక వేతనం పొందుతున్న ఉద్యోగిగా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మొదట్లో హితల్ కెరీర్ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా ప్రారంభమైంది. ఆయన ప్రధానంగా పెట్రో కెమికల్స్ విభాగంపై దృష్టి సారించారు. పెట్రోకెమికల్ పరిశ్రమలో రిలయన్స్‌ను ప్రధాన ప్రపంచ సంస్థగా స్థాపించడంలో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. హితల్ 1986లో రిలయన్స్‌లో భాగమయ్యాడు. జూలై 1, 1988 నుండి, అతను పూర్తి సమయం డైరెక్టర్ అయ్యాడు. కంపెనీ బోర్డులో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయ్యాడు.
Also Read : Gold-Silver Rate Today: బంగారం, వెండి ధరలు ఢమాల్..వరుసగా రెండో రోజు తగ్గిన ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter