Multibagger Stocks: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉందా..ఉంటే ముందు మల్టీ బ్యాగర్ స్టాక్స్ పెట్టుబడిదారుల గురించి తెలుసుకోవల్సిందే. ఎందుకంటే ఇటీవలికాలంలో భారీగా లాభాలు ఆర్జించిపెడుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెన్నీ స్టాక్స్ గత కొద్దికాలంగా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు సంపాదించిపెడుతున్నాయి. మీక్కూడా స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే..ముందుగా మల్టీబ్యాగర్ స్టాక్స్ ఏ విధంగా ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా చేసిందో తెలుసుకుందాం..కెమికల్ స్టాక్‌కు చెందిన కంపెనీ షేర్ 4 ఏళ్లలో ఇన్వెస్టర్లకు 650 శాతం లాభాల్ని తెచ్చిపెట్టింది.


23.50 రూపాయల షేర్ ఇప్పుడు 178 రూపాయలు


ఈ కెమికల్ స్టాక్ కంపెనీ పేరు డీప్ పాలిమర్స్. ఈ కంపెనీ కొద్దికాలంలోనే ఇన్వెస్టర్లకు భారీ లాభాన్ని ఆర్జించింది. స్మాల్‌క్యాప్ స్టాక్ గత 4 ఏళ్లో 23.50 నుంచి పెరిగి..178 రూపాయలకు చేరుకుంది. అత్యధికంగా 458.57 రూపాయలుగా ఉంది. 


ఏడాదిలో వ్యాపారం ఎలా ఉంది


గత ఏడాది కాలంగా చూస్తే సెప్టెంబర్ 2, 2021న స్టాక్ వ్యాల్యూ 100.49 రూపాయలుంది. గత ఏడాది షేర్ విలువ 67.43 శాతం పెరిగింది. అప్పుడీ కంపెనీ షేర్ 67.76 రూపాయలుగా ఉంది. గత రెండేళ్లలో ఈ మల్టీబ్యాగర్ కెమికల్ స్టాక్ 36 రూపాయల్నించి పెరిగి 178 రూపాయలకు చేరుకుంది. అంటే షేర్ దాదాపుగా 400 శాతం పెరుగుదల నమోదు చేసింది. ఈ స్టాక్ గత 4 ఏళ్లలో 23.50 రూపాయల్నించి పెరిగి..178 రూపాయలకు చేరుకుంది. ఇప్పటివరకూ 617.18 శాతం పెరుగుదల కన్పించింది. 


ఒకవేళ ఇన్వెస్టర్ నాలుగేళ్ల క్రితం ఈ కెమికల్ స్టాక్‌లో 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి ఉంటే..ఇప్పుడది 7.50 లక్షలకు చేరుకుంది. ఈ షేర్ గత 52 వారల్లో రికార్డు స్థాయిలో 458.57 రూపాయలుంది. అటు గత 52 వారాల్లో 93.14 రూపాయలుంది. 


Also read: 7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 4 శాతం పెంపు, సెప్టెంబర్ 28న ప్రకటన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook