Millionaire Formula: కోటీశ్వరులు కావాలంటే ఈ SIP ఫార్ములా ఫాలో కావల్సిందే
Millionaire Formula: లక్షలు సంపాదించాలని, ఆర్ధికంగా స్థిరపడాలని చాలామంది కలలు కంటుంటారు. కానీ ఎలా సాకారం చేసుకోవాలో తెలియదు. కొన్ని పధకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లక్షాధికారులు కావచ్చంటున్నారు మార్కెట్ నిపుణులు. అలాంటి కొన్ని చిట్కాలు మీ కోసం..
Millionaire Formula: మీరు కూడా లక్షలు సంపాదించాలనుకుంటే అద్భుతమైన ఫార్ములా ఉంది.య అదే 12-15-20. అసలీ ఫార్ములా ఏంటి, దీనికీ లక్షాధికారి కావడానికి సంబంధమేంటనేది తెలుసుకుందాం. ఈ ఫార్ములా ఉపయోగిస్తే 15 ఏళ్లలో లక్షాధికారి కావచ్చంటున్నారు. అదెలాగో తెలుసుకుందాం.
ఆర్ధికంగా స్థిరపడటం లేదా లక్షలు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు. చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మ్యూచ్యువల్ ఫండ్స్ ఉన్నాయి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ప్రతి నెలా 2 వేల నుంచి 5 వేలు ఇన్వెస్ట్ చేస్తుంటే కొన్నేళ్లకు మీ పెట్టుబడి లక్షలు కావచ్చు. దీర్ఘకాలిక SIP పధకాల్లో మార్కెట్ రిస్క్ ఉంటుంది. కానీ వేగంగా మీ పెట్టుబడి పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఇందులో వచ్చే రిటర్న్స్ మరే ఇతర పథకాలపై రాదు. అంటే మీ డబ్బులు పెరుగుతాయి. స్వల్పకాంలో ఇదే ఎస్ఐపీ ద్వారా లక్షలు సంపాదించాలంటే పెట్టుబడి ఎక్కువగా ఉండాలి.
12-15-20 ఫార్ములా అంటే ఏంటి
మీరు లక్షాధికారి కావాలంటే 12-15-20 ఫార్ములా ఆచరించాల్సిందే. ఇందులో 12 అంటే 12 శాతం రిటర్న్స్, 15 అంటే 15 ఏళ్ల పాటు చేయాల్సిన పెట్టుబడి, 20 అంటే నెలకు 20 వేల పెట్టుబడి. మీరు 30 ఏళ్ల వయస్సులో ఈ ఇన్వెస్ట్‌మెంట్ ప్రారంభిస్తే 45 ఏళ్లు వచ్చేసరికి కోటీశ్వరులు కావచ్చు. ఎస్ఐపీ ద్వారా మ్యూచ్యువల్ ఫండ్స్ పధకంలో నెలకు 20 వేలు డిపాజిట్ చేస్తుంటే 15 ఏళ్లకు మీ పెట్టుబడి 36 లక్షలౌతుంది. ఎస్ఐపీ ప్రకారం 64,91,520 వడ్డీ 12 శాతం చొప్పున వస్తుంది. అంటే మొత్తం 15 ఏళ్లకు మీరు 1 కోటి 91,520 రూపాయలు ఆర్జిస్తారు.
Also read: Car Loan Interest Rates: కారు లోన్ కావాలా, ఏ బ్యాంకులో ఎంత వడ్డీ ఉందో చెక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook