వావ్: గూగుల్ పేలో కొత్త ఫీచర్.. వాయిస్ కమాండ్‌తో మనీ ట్రాన్స్ ఫర్
ఇక నుండి మనీ ట్రాన్స్ ఫర్ కోసం నంబర్ టైపు చేయాల్సిన అవసరం లేదు.. వాయిస్ కమాండ్ ద్వారా లావాదేవీలు జరపవచ్చు.. ఈ కొత్త ఫీచర్ ను గూగుల్ పే ప్రవేశపెట్టింది.
New Feature in Google Pay: డిజిటల్ ప్రెమెంట్స్ లలో గూగుల్ పే (Google Pay) దూసుకుపోతుంది. దేశంలో గూగుల్ పే వినియోదాగారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న డిజిటల్ లావాదేవీలకు అనుగుణంగానే గూగుల్ కొత్త ఫీచర్లను (New Feature in Gpay) అందుబాటులోకి తీసుకొస్తుంది.
డిజిటల్ చెల్లింపులను (Digital Payments) మరింత సులభతరం చేసే లక్ష్యంతో, గూగుల్ పేలో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.. వాయిస్ కమాండ్‌ని ఉపయోగించి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలకు డబ్బును బదిలీ చేయడానికి అనుమతించే గూగుల్ పే లో పే-వయా-వాయిస్ ఫీచర్ (Pay Via Voice Feature)ను కూడా అందుబాటులోతీసుకొచ్చింది. ఈ ఫీచర్ గూగుల్ పే వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.
Also Read: సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!
గూగుల్ కంపెనీ స్పీచ్ టు టెక్స్ట్ (Speach to Text)లాంచ్‌ను ప్రవేశపెట్టింది. వాయిస్ ఓవర్ తో నడిచే దీనిలో వాయిస్ తో ఇచ్చే ఇన్‌పుట్ ద్వారా మీ ఖాతా నుండి నేరుగా మరొక యూజర్ బ్యాంక్ ఖాతాకు చెల్లించడానికి అనుమతిస్తుంది. అంటే ఇక నుండి నంబర్ లేదా బ్యాంకు అకౌంట్ నంబర్ టైప్ చేయాల్సిన అవసరం లేదన్న మాట..
గూగుల్ పే ద్వారా ఎవరికైన నగదు బదిలీ కోసం.. నంబర్ లేదా అకౌంట్ నంబర్ టైపు చేయటానికి బదులు.. ఇంగ్లీష్ (English) లేదా హిందీ (Hindi) లో నంబర్ చదివితే చాలు.. వాయిడ్ కమాండ్ ద్వారా నంబర్ లను అదే టైప్ చేసుకుంటుంది. ఈ కొత్త ఫీచర్ ను గూగుల్ పే లో ప్రవేశపెట్టారు.
Also Read: PM Kisan Scheme: రూ.55-రూ.200 కట్టండి.. నెలకు రూ.3 వేలు పెన్షన్ పొందండి.. రైతులకు మాత్రమే
ఇంగ్లీష్, హిందీలతో పాటు హింగ్లిష్‌ను (Hinglish) కూడా గూగుల్ పే లో జోడించారు.. ఇంగ్లిష్ అక్షరాల్లో రాసే హిందీని హింగ్లిష్ పేర్కొంటారు. నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ప్రజలు హింగ్లిష్‌లోనే టైప్ చేసే కారణంగా దీనిని కలిపారు. అంతేకాకుండా.. కరోనా కారణంగా చిరు వ్యాపారాలు చాలా వరకు నష్టపోయారు. తిరిగి వారి వ్యాపారాలు ఊపందుకునే లక్ష్యంగా గూగుల్ పే లో "మైషాప్" (Myshop) అనే కొత్త ఫీచర్ ను కూడా యాడ్ చేసింది .
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook