New Hand Baggage Rules: తరచూ విమానయానం చేసేవారికి ముఖ్య గమనిక. విమానయాన శాఖ హ్యాండ్ బ్యాగేజ్ విధానంలో మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఉన్న హ్యాండ్ లగేజ్ విధానం నిబంధనలు కఠినతరం చేసింది. ఇకపై దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో ఈ కొత్త విధానం అమలు కానుంది. కొత్త పాలసీ ప్రకారం విమానంలో కేవలం ఒక్క బ్యాగేజ్ మాత్రమే తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విమానయాన లగేజ్ విషయంలో కొత్త నిబంధనలు వచ్చాయి. దేశీయ, అంతర్జాతీయ విమానయానంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా ఒకే విధమైన లగేజ్ నిబంధనలు అమలు కానున్నాయి. ఎయిర్ పోర్టుల్లో పెరిగిపోతున్న రద్దీని నియంత్రించేందుకు కొత్త హ్యాండ్ లగేజ్ విధానం అమలు చేయనుంది విమానయాన శాఖ. ఈ కొత్త నిబంధనల ప్రకారం ఇకపై తమ వెంట ఒకే ఒక హ్యాండ్ బ్యాగ్‌కు అనుమతి ఉంటుంది. అదనపు లగేజ్ ఉంటే చెక్ ఇన్ కావల్సిందే. ఎకానమీ లేదా ప్రీమియం ఎకానమీ కేటగరీ ప్రయాణీకులు విమానంలో 7 కిలోల వరకే హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్లగలడు. ఫస్ట్ క్లాస్ లేదా బిజినెస్ కేటగరీ ప్రయాణీకులకు పది కిలో వరకూ అనుమతి ఉంటుంది. 


హ్యాండ్ బ్యాగేజ్ కొలతలు ఇవే


కేవలం బరువు మాత్రమే కాకుండా బ్యాగ్ కొలతలు కూడా నిర్ణయించింది. దీని ప్రకారం బ్యాగేజ్ ఎత్తు 55 సెంటీమీటర్లు, పొడవు 40 సెంటీమీటర్లు, వెడల్పు 20 సెంటీమీటర్లు దాటకూడదు. హ్యాండ్ బ్యాగ్ చుట్టుకొలత 115 సెంటీమీటర్లు మించకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రయాణీకుడి లగేజ్ నిర్ణీత బరువు లేదా విస్తీర్ణం దాటితే అదనపు ఛార్జీలుంటాయి. అయితే ఈ ఏడాదిలో మే 2వ తేదీకంటే ముందే టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణీకులకు మాత్రం పాత నిబంధనలే వర్తిస్తాయి. దీని ప్రకారం ఎకానమీ కేటగరీ ప్రయాణీకులు 8 కిలోలు, ప్రీమియం ఎకానమీ ప్రయాణీకులు 10 కిలోలు, బిజినెస్ కేటగరీ ప్రయాణీకులు 12 కిలోల వరకూ హ్యాండ్ బ్యాగేజ్ తీసుకెళ్లవచ్చు. 


Also read: DA Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్, జనవరి నుంచి భారీగా జీతం పెంపు ఎంతంటే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.