Rules Changes From 1st March: ప్రతి నెలా కొత్త నిబంధనలు అమలవుతున్న విషయం తెలిసిందే. మార్చి 1వ తేదీ నుంచి అనేక నియమాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎల్‌పీజీ సిలిండర్‌ ధరల భారం మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫాస్టాగ్ నిబంధనల్లో కూడా మార్పులు రానున్నాయి. బ్యాంకులకు కూడా 14 రోజులు సెలవులు రానున్నాయి. కేంద్ర ఐటీ శాఖ సోషల్ మీడియాకు సంబంధించిన కొత్త రూల్స్ అమలు చేయనుంది. మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్‌పై ఓ లుక్కేయండి..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఎల్‌పీజీ సిలిండర్ ధరలు..
 
ప్రతి నెలా ఒకటో తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్‌ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. మార్చి 1 నుంచి ఎల్‌పీజీ సిలిండర్ ధరలో మార్పు ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు. గత నెలలో ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చేయలేదు. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న తరుణంలో ఈసారి గ్యాస్ సిలిండర్ల ధరలో స్వల్పంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1053, ముంబైలో రూ.1052.50, చెన్నైలో రూ.1068.50, హైదరాబాద్‌లో 955 రూపాయులుగా ఉంది.  


Also Read: Poco M6 Pro 5G Price Drop: ఫ్లిప్‌కార్ట్‌లో రూ.10 వేలకే 5,000mAh బ్యాటరీ Poco M6 Pro 5Gను పొందండి!


ఫాస్టాగ్ నిబంధనల్లో మార్పులు..


మీకు వెహికల్‌కు ఫాస్టాగ్ ఇన్‌స్టాల్ చేసుకుని ఉంటే.. నేటితో కేవైసీ గడువు ముగిసిపోనుంది. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్‌కు సంబంధించిన కేవైసీని పూర్తి చేసేందుకు ఫిబ్రవరి 29ని చివరి తేదీగా నిర్ణయించిన విషయం తెలిసిందే. డెడ్‌లైన్‌లోపు కేవైసీ పూర్తి చేసుకోకపోతే.. ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్‌లోకి చేరిపోతుంది. బ్లాక్‌లిస్టులో ఉంటే రెట్టింపు టోల్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.  


14 రోజులు బ్యాంకులు బంద్..


మార్చి నెలలో బ్యాంకులకు సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల పండుగల ఆధారంగా మొత్తం 14 రోజులు బ్యాంకులు బంద్ కానున్నాయి. 


సోషల్ మీడియాకు కొత్త రూల్స్


ఐటీ నిబంధనల్లో కేంద్రం ప్రభుత్వం మార్పులు చేసింది. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఎక్స్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌లలో ఫేక్ సమాచారం, తప్పుడు విషయాలను పోస్ట్ చేస్తే ఫైన్ భారీగా చెల్లించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా చూసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.


Also Read: Best Battery Mobile: అవును ఇది నిజం..28,000mAh బ్యాటరీతో మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌..1 గంట ఛార్జ్‌ చేస్తే 94 రోజుల పాటు స్టాండ్‌బై..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter