New Rules in June: పౌరులారా తస్మాత్ జాగ్రత్త.. జూన్ లో అమలు కానున్న కొత్త రూల్స్!
New Rules in June: పరిపాలన విధానాల పరంగా జరిగే అనేక మార్పుల కారణంగా తరచూ అనేక నిబంధల్లో మార్పులు వస్తుంటాయి. ఈ క్రమంలో జూన్ నెల నుంచి కొన్ని రూల్స్ అమలు కానున్నాయి. అయితే ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందాం.
New Rules in June: దేశంలో పరిపాలన, విధాన పరంగా జరిగే అనేక మార్పులు కారణంగా తరచూ కొత్త రూల్స్ అమలులోకి వస్తుంటాయి. అదే విధంగా రానున్న జూన్ నెలలోనూ కొన్ని కొత్త నిబంధలు అమలులోకి రానున్నాయి. వీటిని తెలుసుకోవడం భారతదేశంలోని ప్రతి పౌరుని బాధ్యత. ప్రజలకు ఉపయోగపడే వాటితో పాటు వారికి ఎక్కువ ఖర్చు చేసే నిబంధలు కూడా ఈసారి అమలు జరగనున్నాయి. అయితే జూన్ లో అమలు కాబోతున్న కొత్త రూల్స్ ఏమిటో తెలుసుకుందాం.
LPG Gas Cylinder ధర..
చమురు సంస్థలు ప్రతి నెలా మొదటి తారీఖున LPG గ్యాస్ సిలిండర్ ధరలను సవరిస్తుంటారు. ఈ విధంగా జూన్ 1వ తారీఖున గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు రానున్నాయి. గత రెండు నెలలుగా LPG గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ వచ్చిన చమురు సంస్థలు.. అయితే ఈసారి కూడా పెంచుతాయా? తగ్గిస్తాయా? అనే ఆలోచన ప్రతిఒక్కరిలోనూ ఉంది. అయితే ఇటీవలే పీఎం ఉజ్వల స్కీమ్ కింద లబ్ధిదారులు ప్రతి సిలిండర్ కొనుగోలు పై రూ. 200 సబ్సీడీ పొందే అవకాశం ఉంది.
బంగారం హాల్ మార్కింగ్..
బంగారానికి హాల్ మార్కింగ్ రెండో దశ జూన్ 1 నుంచి అమలు కాబోతుంది. గతేడాది జూన్ 16 నుంచి గోల్డ్ హాల్ మార్కింగ్ మొదటి దశ అమలులోకి రాగా.. దాని ఏడాది కాలం ముగిసిన క్రమంలో రెండో దశను అమలు చేయనున్నారు. ఈ నిబంధన ద్వారా నగల షాపుల్లో హాల్ మార్కింగ్ ఆభరణాలను మాత్రమే అమ్మేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
బ్యాంకు సర్వీస్ ఛార్జీలు..
భారతీయ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (IPPB), ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ఈసారి బ్యాంకు సర్వీస్ ఛార్జీలను ప్రకటించింది. AePS ట్రాన్సాక్షన్స్ జరిపేవారు పెరిగిన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ పెరిగిన సర్వీస్ ఛార్జీలు జూన్ 15 నుంచి అమలులోకి రానున్నాయి. బ్యాంకుల్లో క్యాష్ విత్ డ్రా, డిపాజిట్ సర్వీస్ లపై రూ. 20తో పాటు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. దీంతో పాటు మినీ స్టేట్ మెంట్ రూ.5 తో పాటు అదనంగా జీఎస్టీ చెల్లించాలి.
వాహనాల ఇన్స్యూరెన్స్..
థర్డ్ పార్టీ మోటార్ ఇన్స్యూరెన్స్ ప్రీమియం పెంచుతున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవలే ప్రకటించింది. ఈ విధంగా పెరగనున్న థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ ప్రీమియం వివరాలను విడుదల చేసి.. వాటిని జూన్ 1 నుంచి అమలులోకి తీసుకురానున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు కొనేవారు కూడా ఇన్స్యూరెన్స్ ప్రీమియంను కొద్దిగా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది.
Also Read: Railway Ticket QR Code: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ తో టికెట్ జారీ!
Also Read: Boat 175 Airdopes Launch: వాటర్ ప్రూఫ్ ఇయర్ బడ్స్.. 35 గంటలు నాన్ స్టాప్ వర్కింగ్ తో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook