Railway Ticket QR Code: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ తో టికెట్ జారీ!

Railway Ticket QR Code: రైలు ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే మరో సరికొత్త సౌకర్యాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో ప్రతి రైల్వే స్టేషన్లలో ATVMల నుంచి టికెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, నెలవారీ పాస్‌లను ఇకపై క్యూఆర్ కోడ్ పొందవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.    

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 03:35 PM IST
Railway Ticket QR Code: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ తో టికెట్ జారీ!

Railway Ticket QR Code: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్! రైలు ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వేశాఖ కొత్త టికెట్టు సౌకర్యాన్ని ప్రారంభించింది. దీంతో ప్రయాణికులు టికెట్ల కోసం క్యూలైన్లలో నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా పోయింది. అయితే కొత్త సదుపాయం ప్రకారం.. మీరు ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషిన్ (ATVM) నుంచి లభించే సౌకర్యాల కోసం డిజిటల్ లావాదేవీల ద్వారా కూడా చెల్లించగలరు.

డిజిటల్ మోడ్‌లో చెల్లింపులు

ఈ సదుపాయంలో భాగంగా.. ATVM నుంచి టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, నెలవారీ పాస్‌లను పొందడానికి డిజిటల్ మోడ్‌లో చెల్లించవచ్చు. పలు రైల్వే స్టేషన్లలో ఏటీవీఎంలు, యూపీఐ, క్యూఆర్ కోడ్‌లను అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. దీని ద్వారా ATVM స్మార్ట్ కార్డ్‌ను కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని రైల్వే స్టేషన్లలో టికెట్లు కొనేందుకు పెద్ద క్యూలైన్లను తప్పించుకునే అవకాశం ఉంది. 

ఈ సదుపాయం కింద మీరు Paytm, PhonePe, Freecharge, UPI ఆధారిత మొబైల్ యాప్‌ల నుండి QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా చెల్లించాలి. మీరు టికెట్ వెండింగ్ మెషీన్‌లో QR కోడ్ ఫ్లాషింగ్‌ను చూస్తారు. ఆ తర్వాత మీరు దాన్ని స్కాన్ చేయాలి. దాన్ని స్కాన్ చేసి, చెల్లింపు చేసిన తర్వాత మీరు మీ గమ్యస్థానానికి టికెట్ పొందుతారు. రైల్వేల ద్వారా డిజిటల్ చెల్లింపు సౌకర్యాన్ని ప్రోత్సహించేందుకు QR కోడ్ నుండి టిక్కెట్లను కొనుగోలు చేసే సదుపాయం భారతీయ రైల్వే ప్రారంభించింది.  

Also Read: Apple iPhone 11 Flipkart: ఐఫోన్ 11పై ఫ్లిప్ కార్ట్ లో భారీ తగ్గింపు.. రూ.12,499కే అందుబాటులో!

Also Read: IFB AC Flipkart: ఫ్లిప్ కార్ట్ లో సమ్మర్ సేల్.. రూ.30 వేలకే ఎయిర్ కండిషనర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News