Boat 175 Airdopes Launch: వాటర్ ప్రూఫ్ ఇయర్ బడ్స్.. 35 గంటలు నాన్ స్టాప్ వర్కింగ్ తో!

Boat 175 Airdopes Launch: boAt కంపెనీ ఇటీవలే అద్భుతమైన సౌండ్‌తో వాటర్‌ప్రూఫ్ ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది బలమైన బ్యాటరీ, స్టైలిష్ డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. దీని ధర కూడా చాలా తక్కువ. బోట్ ఎయిర్‌డోప్స్ 175 TWS ధర, విశేషాలను తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : May 26, 2022, 04:48 PM IST
Boat 175 Airdopes Launch: వాటర్ ప్రూఫ్ ఇయర్ బడ్స్.. 35 గంటలు నాన్ స్టాప్ వర్కింగ్ తో!

Boat 175 Airdopes Launch: boAt ఇటీవలే ఎయిర్‌డోప్స్ 175 TWS పేరుతో కొత్త వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను భారతదేశంలో విడుదల చేసింది. బడ్జెట్ పరంగా ఇది చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఇయర్‌బడ్‌లు ప్రారంభంలో Amazonలో విక్రయానికి ఉంచారు. boAt Airdopes 175 TWS శక్తివంతమైన బ్యాటరీ, స్టైలిష్ డిజైన్‌తో వస్తుంది. బోట్ ఎయిర్‌డోప్స్ 175 TWS ధర, విశేషాలను తెలుసుకుందాం.

బోట్ ఎయిర్‌డోప్స్ 175 TWS ధర, వివరాలు..

కొత్త boAt Airdopes 175 అనేక రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇందులో రెడ్, బ్లూ, వైట్, బ్లాక్ వేరియంట్‌లు ఉన్నాయి. ఇయర్‌బడ్‌ల ధర రూ. 1,699 ఉండగా.. దీన్ని మే 27 నుండి అమెజాన్ లో అమ్మకానికి ఉంచారు. 

బోట్ ఎయిర్‌డోప్స్ 175 TWS స్పెసిఫికేషన్‌లు

Airdopes 175 TWS ఇయర్‌బడ్‌లు 10mm ఆడియో డ్రైవర్ సెటప్‌ను కలిగి ఉంది. ఇది గుడ్ సౌండ్ తో పాటు నాణ్యతను అందించడానికి హామీ ఇస్తుంది. ఇది కాకుండా ఈ కొత్త ఇయర్‌బడ్‌లు స్టెమ్‌తో పాటు ఇన్-ఇయర్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. స్పష్టమైన ఆడియో కాలింగ్ అనుభవాన్ని ఎనేబుల్ చేయడంలో సహాయపడే క్వాడ్ మైక్ సెటప్ కూడా ఉంది. ఇవి వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు కాబట్టి ఇది బ్లూటూత్ 5.2 ప్రమాణాలకు సపోర్ట్ చేస్తుంది.

బ్యాటరీ బ్యాకప్ 

Airdopes 175 TWS పూర్తి ఛార్జ్‌పై 35 గంటల వరకు పని చేస్తుంది. ఛార్జింగ్ కేస్ అదనంగా 27 గంటల ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. ఇయర్‌బడ్‌లు 8 గంటల వరకు పనిచేస్తాయి. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌లో 75 నిమిషాల వరకు ఆడియో ప్లేబ్యాక్‌ ఉంటుంది. ఛార్జింగ్ కేస్‌లో ఛార్జింగ్ కోసం USB టైప్ C పోర్ట్ ఉంది. ఇందులో గూగుల్ అసిస్టెంట్ తో పాటు సిరి అనే వాయిస్ అసిస్టెంట్ లకు సపోర్ట్ చేస్తుంది. 

ALso Read: Railway Ticket QR Code: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇకపై క్యూఆర్ కోడ్ తో టికెట్ జారీ!

ALso Read: Kodak Smart TV Flipkart: ఫ్లిప్ కార్ట్ లో పైసా వసూల్ ఆఫర్.. రూ.500 ధరకే స్మార్ట్ టీవీని కొనేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News