stock market: జోరుమీదున్న స్టాక్ మార్కెట్ సూచీలు..61 వేలు క్రాస్ చేసిన సెన్సెక్స్!
stockmarket: దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరుమీదున్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజీలో సెన్సెక్స్ 61 వేల పాయింట్లను క్రాస్ చేసి సరికొత్త రికార్డు సృష్టించగా ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం సరికొత్త హైని టచ్ చేసింది.
stock market: స్టాక్ మార్కెట్లు(stock market) వరుస లాభాలతో దూసుకెళ్తున్నాయి. నేడు సెన్సెక్స్(Sensex) తొలిసారి 61 వేల పాయింట్ల మార్కును, నిఫ్టీ 18,250 మార్కును దాటేశాయి. ప్రీమార్కెట్ సెషన్‌లో సెన్సెక్స్ 61,600కు కూడా చేరింది. ఉదయం 9.26 గంటల సమయంలో సెన్సెక్స్ 360 పాయింట్లు పెరిగి 61,097 వద్ద, నిఫ్టీ(Nifty) 110 పాయింట్లు పెరిగి 18,271 వద్ద ట్రేడవుతున్నాయి.
Also read: Alliance Air-AIAHL for Sale Now: ఇప్పుడిక ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థల అమ్మకం ప్రారంభం
మార్కెట్లో అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. మైండ్‌ట్రీ, వెస్ట్‌లైఫ్ డెవలప్‌మెంట్, విప్రో,హింద్ జింక్, పర్సిస్టెంట్ సిస్టమ్స్ షేర్లు(Shares) లాభాల్లో ఉండగా.. ప్రికోల్, వీఎస్‌టీ టిల్లర్స్, అరవింద్ లిమిటెడ్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఇగర్ష సిస్టమ్స్ నష్టాల్లో ఉన్నాయి. నేడు 21 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి. వీటిల్లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సైయంట్, డెన్ నెట్‌వర్క్ ఉన్నాయి. అమెరికాలో ఎస్‌అండ్‌పీ 500 0.30శాతం లాభపడగా.. నాస్‌డాక్ 0.73 శాతం పెరిగింది. జపాన్, దక్షిణ కొరియా సూచీలు కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook