Good News For SBI Customers: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. ఇకనుంచి నామినీ వివరాలు జత చేసేందుకు, సమర్పించేందుకు ఖాతాదారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పనిలేదంటోంది. ఇంటి వద్ద కూర్చుని ఆన్‌లైన్‌లో నామినీ వివరాలు జత చేయవచ్చునని తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


సేవింగ్ అకౌంట్స్, కరెంట్ అకౌంట్స్, ఫిక్స్‌డ్ ఖాతాలు లేదా రికరింగ్ డిపాజిట్(Recurring Deposit) ఖాతాదారులు తమ నామినీని ఆన్‌లైన్‌లోనే రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎస్‌బీఐ ట్వీట్ చేసింది. ఎస్‌బీఐ ఆన్‌లైన్ బ్యాంకింగ్ పోర్టల్ (SBI Online Banking)లో ఖాతాదారులు తమ నామినీని రిజిస్టర్ చేసుకునే సదుపాయాన్ని కల్పించినట్లు వెల్లడించింది.


 


Also Read: Ujjwala Yojana: Free LPG కనెక్షన్, రూ.1600 రావాలంటే PMUY వివరాలు తెలుసుకోండి



ఎస్‌బీఐ ఆన్‌లైన్ వెబ్‌సైట్ లేదా యోనో మొబైల్ యాప్‌(YONO Mobile App)ల ద్వారా ఖాతాదారులు తమ ఖాతాలకు నామినీని రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. ఒకవేళ మీకు ఎస్‌బీఐ(State Bank of India) ఇంటర్నెట్ బ్యాంకింగ్ సదుపాయం లేని పక్షంలో మీ సంబంధిత బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి ఆన్‌లైన్ బ్యాంకింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 


Also Read: Income Tax: ఇన్‌కమ్ ట్యాక్స్ లేని దేశాలు కూడా ఉన్నాయి, No Income Tax దేశాలు ఇవే



 



 


బ్యాంకువారు మీకు ప్రి ప్రింటెడ్ కిట్ (Pre Printed Kit) అందించినట్లయితే అందులో యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ ఉంటుంది. ఆ వివరాల ద్వారా నెట్ బ్యాంకింగ్‌లో మీకు ఈ సర్వీసెస్ ద్వారా నామినీని తేలికగా రిజస్టర్ చేసుకోండి. యోనో మొబైల్ యాప్‌నకు 74 మిలియన్ల డౌన్‌లోడ్స్ అయ్యాయి. కేవలం 3 సంవత్సరాల కాల వ్యవధిలో 34.5 మిలియన్ల మంది రిజిస్టర్డ్ యూజర్లను సొంతం చేసుకుంది.


Also Read; SBI debit card లేకుండానే YONO App తో ATM లో మనీ విత్‌డ్రా 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook