UPI and PPI: ఎన్‌పీసీఐ అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం 2 వేల రూపాయలు దాటిన లావాదేవీలపై ఇంటర్‌ఛేంజ్ రుసుము వసూలు చేస్తారు. అయితే ఇది సాధారణ యూపీఐ పేమెంట్లపై కాదని ఎన్‌పీసీఐ వివరించింది. పీపీఐ ఆధారిత యూపీఐ చెల్లింపులపై సర్‌ఛార్జ్ ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పీపీఐ, యూపీఐ అంటే ఏంటనే గందరగోళం నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌పై ఛార్జ్ వసూలు చేసే విషయమై ఎన్‌పీసీఐ స్పష్టత ఇచ్చేసింది. ఎక్కౌంట్ నుంచి ఎక్కౌంట్‌కు చేసే యూపీఐ చెల్లింపులపై కస్టమర్లకు ఏ విదమైన ప్రభావం పడదు. మొదట్లో అయితే యూపీఐ చెల్లింపులపై 1.1 శాతం ఛార్జ్ పడుతుందనే వార్తలు వచ్చాయి. ఇవి పూర్తిగా అవాస్తవాలు. ఎన్‌పీసీఐ సర్క్యులర్ ప్రకారం 2 వేలు దాటిన పీపీఐ ఆధారిత యూపీఐ చెల్లింపులపై మాత్రమే సర్‌ఛార్జ్ ఉంటుంది.


గత కొన్నేళ్లుగా యూపీఐ యూజర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటి వరకూ సాధారణ యూపీఐ యూజర్లు ఎలా వినియోగించారో అదే విధంగా వాడవచ్చని ఎన్‌పీసీఐ వివరించింది. కానీ చాలామందికి ఇంకా పీపీఐ విషయంలో సందేహాలున్నాయి. గందరగోళముంది. అసలు పీపీఐ, యూపీఐ అంటే ఏంటి..


ఆన్‌లైన్ వాలెట్ స్మార్ట్ వోచర్, స్మార్ట్ కార్డ్, ఇతర ప్రీ పెయిడ్ చెల్లింపు సాధనాలు. ఏదైనా సామాను ఖరీదు చేసేటప్పుడు, మొబైల్ రీఛార్డ్ విషయంలో యూజర్లు వినియోగిస్తుంటారు. ఉదాహరణకు పేటీఎం వ్యాలెట్ పీపీఐకు ఒక ఉదాహరణ. ఇంకా సులభంగా తెలియాలంటే పేమెంట్ యాప్. ఇందులో ముందుగా వేసి ఉంచిన డబ్బులతో షాపింగ్ చేస్తుంటారు. 


ఎన్‌పీసీఐ సర్క్యులర్ ప్రకారం ఏప్రిల్ 1, 2023 నుంచి ప్రీపెయిడ్ చెల్లింపుల ఇన్‌స్ట్రుమెంట్ పీపీఐ ద్వారా 2 వేల కంటే ఎక్కువ లావాదేవీలు జరిపితే 1.1 శాతం సర్‌ఛార్జ్ ఉంటుంది. యూపీఐ ద్వారా వ్యాలెట్‌లో డబ్బులు యాడ్ చేయడంపై కూడా ఇది వర్తిస్తుంది. యూపీఐ ద్వారా బ్యాంక్ నుంచి బ్యాంకుకు నగదు బదిలీ చేస్తే ఏ విధమైన సర్‌ఛార్జ్ ఉండదు.


ఇంటర్‌ఛేంజ్ ఫీజు ఎవరు చెల్లించాలి


ఏప్రిల్ 1, 2023 నుంచి మర్చంట్ పీపీఐ ద్వారా జరిపిన 2000 కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై రిసీవర్ బ్యాంక్ లేదా పేమెంట్ ప్రొవైడర్‌కు చెల్లించాలి. కస్టమర్ తరపున ఎలాంటి అదనపు మొత్తం చెల్లించాల్సిన పనిలేదు.


యూపీఐతో పీపీఐ పేమెంట్ అంటే


ఉదాహరణకు ఎవరైనా వ్యాపారికి మీరు పేటీఎం వ్యాలెట్ ద్వారా డబ్బులు చెల్లించాలంటే మీరు ఆ వ్యాపారి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తుంటారు. ఇది నేరుగా ఆ వ్యాపారి బ్యాంకు ఎక్కౌంట్‌లోకి డబ్బులు చెల్లించేందుకు అనుమతిస్తుంది. ఏప్రిల్ నుంచి 2000 రూపాయలు దాటిన లావాదేవీలపై 1.1 శాతం ఇంటర్ ఛేంజ్ ఫీజు ఉంటుంది. ఈ ఫీజును వ్యాపారి చెల్లించాల్సి ఉంటుంది. 


Also read: 7th pay commission: మొన్న డీఏ పెంపు, ఇప్పుడు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook