Oil Purify Test: ఏ వంట అయిన సరే నూనే లేనిదే మనం వండలేము. వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయిన సరే అది లేనిదే ఇల్లు నడవదు. ఓ వైపు వంట నూనె ధరలు  పెరుగుతుంటే..  మరో వైపు కల్తీ నూనెలు కూడా అదే మోతాదులో పెరుతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నూనె లేనిదే వంట చేయలేని పరిస్థితి.. ఇదే అదునుగా తీసుకుంటున్న కొన్ని కంపెనీలు, మోసాగాళ్లు కల్తీ నూనె తయారీకి పాల్పడుతూ సాధారణ ప్రజలను దండుకొంటున్నారు. వీటి వలన సామాన్యుల ఆరోగ్యాలే కాదు... డబ్బులు కూడా వృదా అవుతున్నాయి. ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ఎన్ని రకాలుగా కల్తీ ఆహార పదార్థాలను అరికట్టడానికి ప్రయత్నిస్తున్న, మార్కెట్లోకి ఇవి వస్తూనే ఉన్నాయి.


Also Read: Petrol Price Fall: GST పరిధిలోకి పెట్రో-డీజిల్ ధరలు..? రూ. 30 తగ్గుదల..? ప్రభుత్వాలు దీనికేందుకు వ్యతిరేఖం?


మరీ మనం వాడే వంట నూనె నిజంగానే మంచిదేనా ? లేక కల్తీదా ఎలా తెలుసుకోవటం..?? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కల్తీ వంట నూనె ఒక ప్రధాన సమస్యగా మారిపోయిందని చెప్పవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న ప్రయోగం మరియు చిట్కాల ద్వారా మనం రోజు వాడే నూనె కల్తీదో లేదో తెలుసుకోవచ్చు. 


ముఖ్యంగా వంట నూనెను కల్తీ చేయటానికి పాస్పరస్ కలిగిన పెస్టిసైడ్‌ లను వాడతారు దీని పేరు "ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌" (Tri Ortho Cresyl Phosphate) అనే రసాయనం. దీని వాడటం ద్వారా నూనె కల్తీ అవ్వటం... అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ఈ రసాయన మన శరీరంలో ప్రవేశిస్తే నాడీవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి, పక్షవాతం మరియు ఇతరేతర భయంకర వ్యాధులకు దారితీస్తుంది. దీనికి సంబంధించిన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (Food Safety and Standards Authority of India) ఓ వీడియోను తయారు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. మనం రోజు వాడే వంట నూనె కల్తీదో లేదో తెలియాలంటే ఇంట్లోనే చిన్న ప్రయోగం చేస్తే సరిపోతుంది 


Also Read: PM Modi's Birthday: వ్యాక్సిన్ పంపిణీ లో భారత్ రికార్డ్... 6 గంటల్లో కోటి వ్యాక్సిన్ డోసులు




ప్రయోగ విధానం:


1) మొదటగా మనం వాడే 2 మిల్లీ లీటర్ల వంట నూనెను 2 పాత్రల్లోకి తీసుకోండి
2) రెండింటిలో పసుపు రంగు ఉన్న వెన్నను వేయండి
3) ఒకవేళ పాత్రలో వంట నూనె రంగు మారితే అది కల్తీదని అర్థం
4) ఒకవేళ పాత్ర రంగులో ఎలాంటి మార్పు లేకపోతే వాడే నూనె స్వచ్చమైనదని అర్థం


పాత్రలోని వంట నూనె ఎరుపు రంగులోకి మారితే నూనెలో ట్రై ఆర్థో క్రెసిల్ ఫాస్ఫేట్‌ (Tri Ortho Cresyl Phosphate) అనే రసాయనం ఉందని అర్థం. ఒకవేళ నూనె రంగు మారకపోతే అది స్వచ్చమైన వంట నూనె అని, ఇందులో ఎలాంటి హాని చేసి రసాయనిక పదార్థాలు లేవని అర్థం. 


Also Read: Bigg Boss 5 Telugu: పింకికీ కన్నడ నటి మద్దతు...మార్పు తీసుకొద్దామంటున్న హీరోయిన్


కావున, ఇంట్లోనే జరిపే ఈ చిన్న ప్రయోగం ద్వారా మీరు వాడే నూనె కల్తీదో లేదో ఒకసారి టెస్ట్ చేయండి. మరెందుకు ఆలస్యం వెంటనే ఈ పరీక్ష చేసి మీరు వాడే నూనె స్వచ్చమైనదో లేదో తెలుసుకోండి.  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook