PM Modi's Birthday: వ్యాక్సిన్ పంపిణీ లో భారత్ రికార్డ్... 6 గంటల్లో కోటి వ్యాక్సిన్ డోసులు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రచారంలో మధ్యాహ్నం 1:35 గంటల వరకు దేశవ్యాప్తంగా 6 గంటల్లో 1 కోటి మందికి పైగా ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చి, రికార్డు నెలకొల్పబడింది

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2021, 03:40 PM IST
  • మోదీ పుట్టిన రోజు సందర్భంగా వ్యాక్సిన్ లో రికార్డు
  • ఒకే రోజులో కేవలం 6 గంటల్లో 1 కోటి డోసులు
  • వ్యాక్సిన్ ప్రతి ఒక్కరి హక్కు అంటూ మోదీ నినాదం
PM Modi's Birthday: వ్యాక్సిన్ పంపిణీ లో భారత్ రికార్డ్... 6 గంటల్లో కోటి వ్యాక్సిన్ డోసులు

PM Modi's Birthday occasion: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు (PM Narendra Modi Birthday) సందర్భంగా భారతీయ జనతా పార్టీ (BJP) కార్యకర్తలు దేశవ్యాప్తంగా ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టారు మరియు రికార్డు స్థాయిలో టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 1 కోటి మందికి పైగా దేశవ్యాప్తంగా మధ్యాహ్నం 1:35 వరకు టీకా ఇవ్వబడింది. రికార్డు మొత్తంలో టీకాలు వేయటానికి  బీజెపీ కార్యకర్తలు నిరంతరం కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం ప్రజలను ప్రేరేపిస్తున్నారు, తద్వారా ఒకే రోజులో అధిక మొత్తంలో టీకాలు వేయటంతో పాత రికార్డులన్నీ తిరగరాయబడ్డాయి. 

రోజుకు 2 కోట్ల డోసుల టీకా ఇవ్వాలని లక్ష్యం
భారతీయ జనతా పార్టీ (BJP) ప్రత్యేక ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా 2 కోట్ల కరోనా వ్యాక్సిన్ టీకా  (Record Vaccination on PM Narendra Modi Birthday) లను ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తంలో అత్యధికంగా సింగిల్ డోస్ వాక్సిన్ తీసుకున్న దేశంగా మరియు 62 శాతం వయోజన జనాభా కలిగిన దేశంలో అత్యధిక సింగిల్ డోస్ వాక్సిన్ తీసుకున్న దేశంగా నిలిచింది. 

Also Read: Ola scooters: ఇ-కామర్స్ చరిత్రలో 'ఓలా' సరికొత్త రికార్డు...రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు అమ్మకాలు..

దేశవ్యాప్తంగా 77.25 కోట్ల డోస్ ల వ్యాక్సిన్ ఏర్పాటు
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (Union Ministry of Health and Family Welfare) డేటా ప్రకారం, ఇప్పటివరకు (సెప్టెంబర్ 17, ఉదయం 7) భారతదేశంలో 77 కోట్ల 24 లక్షల 25 వేల 744 మోతాదుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడింది. దేశవ్యాప్తంగా 58 కోట్ల 26 లక్షల 6 వేల 905 మంది మొదటి డోస్ తీసుకున్నారు, 18 కోట్ల 98 లక్షల 18 వేల 839 మందికి రెండు డోసులు ఇచ్చారు.

99 శాతం హెల్త్ వర్కర్ లకు పూర్తైన ఫస్ట్ డోస్ 
కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ (Union Health Secretary Rajesh Bhushan) గురువారం మాట్లాడుతూ, 'భారతదేశంలోని వయోజన జనాభాలో 20 శాతం మంది కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులను పొందారు మరియు 62 శాతం మంది మొదటి డోసును పొందారు. అదే సమయంలో, 99 శాతం మంది హెల్త్ వర్కర్స్ మొదటి డోస్ ను తీసుకున్నారు మరియు 82 శాతం హెల్త్ వర్కర్స్ రెండో డోస్ తీసుకున్నారని తెలిపాడు. అంతేకాకుండా  '100 శాతం ఫ్రంట్‌లైన్ కార్మికులకు మొదటి డోస్ ఇవ్వబడింది, 78 శాతం మందికి రెండు డోస్ వ్యాక్సిన్ ఇవ్వబడిందని తెలిపారు.

Also Read: Petrol Price Fall: GST పరిధిలోకి పెట్రో-డీజిల్ ధరలు..? రూ. 30 తగ్గుదల..? ప్రభుత్వాలు దీనికేందుకు వ్యతిరేఖం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

Trending News