Bigg Boss 5 Telugu: పింకికీ కన్నడ నటి మద్దతు...మార్పు తీసుకొద్దామంటున్న హీరోయిన్

Bigg Boss 5 Telugu: తెలుగు బిగ్ బాస్ షో రోజురోజుకీ ఆసక్తి పెంచుతోంది. కంటెస్టెంట్స్ ఎవరికీ వారు గేమ్ బాగా ఆడుతున్నారు. అయితే రెండో వారం నామినేషన్ లో ఉన్న ప్రియాంక సింగ్ కు ఓ కన్నడ నటి మద్దతు ప్రకటించింది. ఆమె ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా...అయితే ఈ స్టోరీ పై ఓ లుక్కేయండి.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2021, 04:02 PM IST
  • ప్రియాంక సింగ్‌ కు కన్నడ నటి మద్దతు
  • మార్పు తీసుకొద్దామన్న హీరోయిన్
  • రెండో వారం నామినేషన్‌లో పింకీ
Bigg Boss 5 Telugu: పింకికీ కన్నడ నటి మద్దతు...మార్పు తీసుకొద్దామంటున్న హీరోయిన్

Sanjana Galrani Support to Priyanka Singh: బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-5 (Bigg Boss 5 Telugu)అదరగొడుతుంది. అప్పుడే హౌస్‌లో అలకలు, గ్రూపు రాజకీయాలు, లవ్‌ యాంగిల్స్‌ మొదలైన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఎంతో ఫ్రెండ్లీగా ఉంటున్న కంటెస్టెంట్లు టాస్కుల విషయానికి వచ్చే సరికి ఉగ్రరూపం చూపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తిట్టుకుంటూ హౌస్‌ను హీటెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే సోషల్‌మీడియా(Social Media)లో మీమ్స్‌, ట్రోల్స్‌ ట్రెండ్‌ అవుతున్న సంగతి తెలిసిందే.

ట్రాన్స్‌ జెండర్‌(Transgender)గా బిగ్‌బాస్‌(Bigg Boss)లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్‌ (Priyanka Singh‌)అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ..మంచి  మార్కులే కొట్టేస్తుంది. ఇప్పటికే ఆమెకు ప్రేక్షకుల నుంచి భారీగానే మద్దతు లభిస్తోంది. ఇటీవల నటుడు నాగబాబు(Actor Nagababu) సైతం ప్రియాంకకు మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ నటి, బుజ్జిగాడు ఫేం సంజన గల్రానీ(Sanjana Galrani ) సైతం ప్రియాంకకు తన పూర్తి మద్దతును ప్రకటించింది. 

Also Read: Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌజ్‌లో షణ్ముఖ్‌ బర్త్‌డే వేడుకలు.. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన దీప్తీ..

సంజన మాటల్లో..
'ఎప్పుడూ అబ్బాయిలు లేదా అమ్మాయిలే షోలో గెలుస్తారు. కానీ ఈసారి ఒక మార్పు తీసుకొద్దాం. ట్రాన్స్‌జెండర్స్‌ ఎప్పుడూ వాళ్ల జీవితం కోసం ప్రతిరోజు పోరాడుతూనే ఉంటారు. వాళ్ల మీద ఎప్పుడూ నాకు చాలా సాఫ్ట్‌ కార్నర్‌ ఉంటుంది. అందుకే ప్రియాంక సింగ్‌ కోసం ప్రేమగా ఈ వీడియో చేస్తున్నాను. ఆమెకు ఎక్కువ ఓట్లు వేసి గెలిపించండి' అంటూ సంజన ఇన్‌స్టాగ్రామ్‌(Instagram) వేదికగా పిలుపునిచ్చింది.

దీంతో హీరోయిన్ సంజన(Actress Sanjana)పై పింకీ(ప్రియాంక సింగ్‌)ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తొలి వారం సరయూ ఎలిమినేట్‌ కాగా ఈవారం ఉమాదేవి, కాజల్‌, ప్రియ, నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, లోబోలతో పాటు ప్రియాంక సింగ్‌లు నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఇప్పటికే లోబో, ప్రియాంక సింగ్‌, ప్రియలు సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లు అన్‌ అఫీషియల్‌ పోల్స్‌ ద్వారా తెలుస్తుంది. మరి వీరిలో ఈవారం హౌస్‌ నుంచి బయటకు ఎవరు వెళ్తారన్నది తెలియాలంటే ఆదివారం నాటి ఎపిసోడ్‌ వరకు వేచి చూడాల్సిందే.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News