Ola S1X: 360Km మైలేజీ రేంజ్‌తో మార్కెట్‌లోకి Ola S1X మాస్ ఎంట్రీ.. దీని కథే వేరు!
Ola S1X: ఓలా కంపెనీ నుంచి త్వరలోనే మార్కెట్‌లోకి కొత్త స్కూటర్ లాంచ్ కాబోతోంది. ఇది Ola S1X పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పడు తెలుసుకుందాం.
Ola S1X: మార్కెట్‌లో ఎక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. అన్ని కంపెనీలు కొత్త ఫీచర్స్‌తో కూడిన ఎలక్ట్రిక్ స్కూటర్స్‌ను మార్కెట్‌లోకి అతి చౌకగానే లాంచ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మకాల్లో ముందుంది. అయితే దీనిని ఇలాగే కంటిన్యూ చేసేందుకు కంపెనీ అతి త్వరలోనే కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి తమ కొత్త వేరియంట్ స్కూటర్స్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ విషయాన్ని ఓలా కంపెనీ CEO భవిష్ అగర్వాల్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫ్లామ్ Xలో వెల్లడించారు. ఏప్రిల్ 15వ తేదిన కంపెనీ Ola S1X సిరీస్ స్కూటర్స్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా వీటిని అతి తక్కువ ధరలోనే, ఫాస్ట్ డెలివరీతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుసుస్తోంది.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
డైనమిక్ స్పీడ్ డెలివరీ:
ఈ ఓలా ఎస్1ఎక్స్ స్కూటర్ మొత్తం 3 స్పీడ్ మోడ్‌లతో అందుబాటులోకి రాబోతోంది. ఇందులో ఎకో, నార్మల్, స్పోర్ట్ వంటి మోడ్‌లు అందుబాలో ఉంటాయి. అంతేకాకుండా డైనమిక్ స్పీడ్ డెలివరీ టెక్నాలజీ మీరు ఎంచుకున్న మోడ్‌కు అనుగుణంగా పవర్ డెలివరీని సర్దుబాటు చేస్తుందరి కంపెనీ వెల్లడించింది. దీంతో పాటు మీరు స్పీడ్ మోడ్‌లను ఎంచుకుని కావాలనుకున్న డ్రైవింగ్ అనుభవాన్ని పొందవచ్చు.
మోటార్:
ఓలా ఎస్1ఎక్స్ స్కూటర్ 2.3 kWh లిథియం-అయాన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 131 bhp శక్తితో పాటు 342 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఈ స్కూటర్ స్కూటర్ 0 నుంచి 60 kmph వేగాన్ని కేవలం 5.2 సెకన్లలో అందుకోగల శక్తితో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్కూటీ మైలేజీ రేంజ్ వివరాల్లోకి వెళితే, దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు 360 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఛార్జింగ్:
ఇక ఓలా ఎస్1ఎక్స్ స్కూటర్ ఛార్జింగ్ విషయానికొస్తే, 4.5 గంటలలో 0 నుంచి 100% వరకు ఛార్జ్ అవుతుంది. అంతేకాకుండా కంపెనీ ఈ స్కూటర్‌కి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. అలాగే ఈ స్కూటీ 18 నిమిషాలలో 0 నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది.
బ్రేకింగ్ సిస్టమ్:
ఓలా ఎస్1ఎక్స్ స్కూటర్ ఫ్రాంట్, బ్యాక్ డిస్క్ బ్రేక్‌లతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు రిజెనరేటివ్ బ్రేకింగ్‌కు సపోర్ట్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది అత్యధునిక సాంకేతికతో అందుబాటులోకి రాబోతోంది. ఈ స్కూటర్ బ్రేకింగ్ వేసిన సమయంలో ఛార్జింగ్ అయిపోకుండా ఉండేదుకు ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.
టైర్లు:
ఇక ఓలా ఎస్1ఎక్స్ స్కూటర్‌కి సంబంధించిన టైర్ల విషయానికొస్తే, ముందు ట్యూబ్‌లెస్ టైర్లు 12-అంగుళాల సైజ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక బ్యాక్‌లో కూడా ఇదే సైజ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్కూటర్ లైటింగ్ విషయానికొస్తే, ఓలా ఎస్1ఎక్స్ LED హెడ్‌ల్యాంప్, LED టెయిల్‌లైట్, LED డేటైమ్ రన్నింగ్ లైట్‌లతో వస్తుంది. LED లైటింగ్ స్కూటర్‌కు స్టైలిష్, ఆధునిక రూపాన్ని ఇస్తుందని కంపెనీ తెలిపింది.
ఏప్రిల్ 1వ తేది కొత్త EMPS (ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్) భారత్‌లో అమలు కావడంతో అన్ని ఎలక్ట్రిక్ బైకుల తయారీ కంపెనీలు స్కూటర్స్‌పై ధరల్లో మార్పులు వచ్చాయి. దీని కారణంగా కస్టమర్స్‌కి గతంలో ఉన్న సబ్సిడీ ప్రయోజనాలు ఉండకపోవచ్చు. దీని కారణంగా త్వరలోనే లాంచ్ కాబోయే అన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటీలు చాలా ఖరీదుతో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇటీవలే మార్రెట్‌లోకి లాంచ్ అయిన ఏథర్, బజాజ్, టీవీఎస్ స్కూటర్స్ ధరలు కూడా పెరిగ్గొచ్చు. ఈ విషయంపై ఇప్పటికే ఓలా ఓ క్లారిటీ కూడా ఇచ్చేసింది. ఈ కంపెనీ ఏప్రిల్ 15వ తేది నుంచి ధరలను అప్‌డేట్ చేయాలని యోచిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి