Ola, Uber Get Warning ఓలా, ఉబర్‌లతో కేంద్రం చర్చలు .... అందరికీ లాభం కలిగే పనిచేయాలని హితవు
Ola, Uber Get Warning from Govt ఓలా, ఊబర్ పై కేంద్ర ప్రభుత్వ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. సామాన్యులకు కారు సర్వీసులు అలవాటు చేసి ఇప్పుడు ఆ అలవాటును తమకు అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. ఇష్టం వచ్చినట్లు ఎందుకు ధరలు పెంచుకుంటూ పోతున్నారని ప్రశ్నించింది. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు జోక్యం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ రెండు సంస్థలపై అసహనం వ్యక్తం చేసింది. ఈరెండు సంస్థలు ఇష్టారీతిన ధరలను పెంచుకుంటూ పోవడమే కాకుండా రైడ్ క్యాన్సిలేషన్ చేస్తున్నట్లు వినియోగదారులు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో కేంద్రం జోక్యం చేసుకుంది. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కస్టమర్లకు నష్టం కలిగించే విధంగా వ్యాపార విధానాలను అనుసరిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. వినియోగదారులు చేసిన ఫిర్యాదులపై ఓలా, ఊబర్ ఉన్నతాధికారుల నుంచి వివరణ తీసుకుంది.
కస్టమర్ల నుంచి ముందు బుకింగ్స్‌ను తీసుకున్న తర్వాత మళ్లీ బలవంతంగా వాటిని కొంత మంది డ్రైవర్లు క్యాన్సిల్ చేస్తున్నారని తద్వారా తమకు చాలా ఇబ్బంది కలుగుతోందని కొందరు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ రెండు సంస్థలే ట్రిప్ క్యాన్సిల్ చేయించి మళ్లీ కస్టమర్ల నుంచే పెనాల్టీ రూపంలో డబ్బులు బలవతంగా కట్టించుకుంటున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. ముందు కస్టమర్ల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన కేంద్రం వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ .... ఓలా, ఊబర్ సంస్థలకు ఆ డేటాను అందించారు. ఓలా, ఊబర్ వివరణ కోరారు. ఉభయపక్షాల వాదనలు విన్న తర్వాత క్యాబ్ అగ్రిగేటర్లు వెంటనే ఒక పరిష్కారంతో తమ ముందుకు రావాలని సెంట్రల్ కన్జూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ కమిషనర్ నిధి ఖారే ఆదేశించారు. కస్టమర్ల నుంచి ఈ దోపిడీని ముందు ఓలా, ఉబర్ ప్రారభించినా వాటిని చూసి ర్యాపిడో, మీరూ, జుగ్ను వంటి సంస్థలు కూడా ఈ బ్యాడ్ ప్రాక్టీస్‌ను ప్రారంభించినట్లు కేంద్రం గుర్తించింది.
దీంతో ఈ సంస్థల ప్రతినిధులందరితో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి క్యాన్సిలేషన్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తున్నారని ప్రశ్నించింది. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆన్‌లైన్ రైడ్ అగ్రిగేటర్ల కూడా తమ వాదన బలంగా వినిపించారు. క్షేత్ర స్థాయిలో ఉన్న ఇబ్బందులను కేంద్రానికి తెలిపారు. కొంత మంది అన్ ప్రొఫెనల్స్ వల్లే అక్కడక్కడ ఇలా జరుగుతోందని కాని ఇది సంస్థ పాలసీ కాదని వివరించారు. తదుపరి చర్చల్లో ఈ అంశంపై పురోగతి రానుంది.
alsor read SBI FD Interest Rates: ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాదారులకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంపు
also read Facebook Features: ఇక నుంచి Facebookలో ఈ 2 ఫీచర్లు పనిచేయవు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook