New Pan Card: కేంద్ర కేబినెట్ ఇటీవలే పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 1435 కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు ఆమోదంతో ట్యాక్స్ పేయర్లకు చాలా సందేహాలు వస్తున్నాయి. ఇప్పుడున్న పాన్ కార్డు పని చేస్తుందా లేదా, కొత్త పాన్ కార్డు తీసుకోవాలంటే ఏం చేయాలనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు 2.0 ప్రాజెక్టుకు ఓకే చెప్పడంతో త్వరలో అందరికీ కొత్త పాన్ కార్డులు అందనున్నాయని తెలుస్తోంది. అదే సమయంలో ట్యాక్స్ పేయర్లు , పాన్ కార్డు హోల్డర్లు అందరిలో చాలా సందేహాలు తిరుగుతున్నాయి. పాత్ పాన్ కార్డు పని చేస్తుందా లేదా కొత్త పాన్ కార్డు కోసం ఏం చేయాలనేది ప్రధాన సందేహం. ఈ సందేహాలకు నివృత్తి చేసే ప్రయత్నమే ఇది. పాన్ కార్డు 2.0 అనేది పాత పాన్ కార్డుకు అప్‌గ్రేడేషన్. కొత్త పాన్ కార్డులో క్యూఆర్ కోడ్ ఉంటుంది. కొత్త పాన్ కార్డు పొందేందుకు ట్యాక్స్ పేయర్లు నయా పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా పూర్తిగా ఉచితంగా ఈ కొత్త పాన్ కార్డును పొందవచ్చు. 


ట్యాక్స్ పేయర్లకు మరింత సులభమైన డిజిటల్ సేవలు అందించడంలో భాగంగా  పాన్ 2.0 ప్రాజెక్టు ప్రారంభం కానుంది. కొత్త పాన్ కార్డు ద్వారా ట్యాక్స్ పేయర్ల రిజిస్ట్రేషన్, సేవలు వేగవంతమౌతాయి. మొత్తం డేటా ఒకే చోట లభ్యమౌతుంది. ఆన్‌లైన్ విధానంలో ఈకో ఫ్రెండ్లీ ప్రాజెక్టు ఇది. ఇప్పటికే 78 కోట్ల పాన్ కార్డులు ఇప్పటికే జారీ అయ్యాయి. ఇందులో 98 శాతం పాత పాన్ కార్డు హోల్డర్లే కావడం విశేషం.


Also read: IPL 2025 Full Teams: ఐపీఎల్ 2025 వేలం తరువాత 10 ఫ్రాంచైజీల ఫుల్ స్క్వాడ్ ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.